ఈ కొండ చిలువ ఏం చేస్తుందో చూస్తే షాక్ అవుతారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ..

|

Feb 28, 2021 | 12:33 PM

సోషల్ మీడియం అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మరింత చిన్నదైపోయిందనిపిస్తుంది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా స్మార్ట్ ఫాలో ప్రత్యక్షమైపోతుంది.

ఈ కొండ చిలువ ఏం చేస్తుందో చూస్తే షాక్ అవుతారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ..
Follow us on

Viral video : సోషల్ మీడియం అందుబాటులోకి వచ్చాక ప్రపంచం మరింత చిన్నదైపోయిందనిపిస్తుంది. ఎక్కడ చీమ చిటుక్కుమన్నా స్మార్ట్ ఫాలో ప్రత్యక్షమైపోతుంది. ఇక వైరల్ వీడియోలకు కొదవే లేదు. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి వింత విచిత్రం కనిపించిన అది సోషల్ మీడియాలో దర్శమిచేస్తుంది. ఇదిలా ఉంటే చెట్లెక్కడం అంటేపిల్లలకు మహాసరదా.. కొంతమంది కోతికన్నా స్పీడ్ గా చెట్టెక్కి ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే ఇక్కడ చెట్టెక్కింది మాత్రం మనిషి కాదు.. ఒకపాము చెట్టెక్కింది.

నిత్యం మనం నెట్టింట్లో పాముల వీడియోలు చాలానే చూస్తుంటాం.. రకరకాల పాములు సోషల్ మీడియా ద్వారా చూస్తుంటాం.. అన్నింటికన్నా పెద్దది భయంకరమైనది కొండచిలువే అయ్యుంటుంది బహుశా.. కొండచిలువ ఒక జంతువుని కానీ మనిషిని కానీ తింటే అది చెట్టుకు చుట్టుకొని  అరిగించుకుంటుందని కొందరు చెప్తుంటారు. అయితే ఇక్కడ కొండచిలువ ఎవ్వరిని తినలేదు కానీ చెట్టెక్కుతూ కనిపించింది.

ఒక కొండ చిలువ ఎంతో చక్కగా చెట్టు ఎక్కుతూ కనిపించింది. దానిని అక్కడ ఉన్నవారు వీడియో తీశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. మాములుగా పాములు ముందుకు సాగుతూ చెట్లను ఎక్కుతాయి. అయితే కొండచిలువ మాత్రం చెట్టు చుట్టుకుంటూ.. మెల్లగా పైకి ఎక్కుతుంది. ఈ వీడియో చూడటానికి భయమేసినా ఆ పాము చెట్టు ఎక్కినా తీరు నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ఈ వీడియోపై రకరకాల కామెంట్లు పెడుతూ తెగ షేర్ చేస్తున్నారు కొందరు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

పాము చెట్టెక్కుతున్న వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని ఇక్కడ చదవండి : 

Blue whale shark:ఒడిశాలో చక్కర్లు కొడుతున్న బ్లూ వేల్ షార్క్..20 అడుగుల సొరచేప వడ్డుకు వస్తే..వైరల్ వీడియో

Fight With Cheetah video :కుటుంబం కోసం చిరుతతో ఫైట్‌ చేసిన రియల్‌ హీరో.. వైరల్ అవుతున్న వీడియో