ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయింది. దీనితో వాస్తవాల కంటే కల్పితాలే ఎక్కువగా ప్రచారం అవుతున్నాయి. ఎలాంటి అడ్డు అదుపు లేకుండా ఫేక్ న్యూస్ స్పీడ్‌గా విస్తరిస్తోంది. తాజాగా ప్రజలను మభ్యపెట్టేలా ఓ పుకారు నెట్టింట్లో తెగ షికారు చేస్తోంది. ”ప్రధాన మంత్రి మంధన్ యోజన కింద 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి రూ. 1800 పెన్షన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. అందుకోసం ఈ లింక్ క్లిక్ చేయాలి” అని ఓ వార్త ప్రస్తుతం వాట్సాప్, సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. దీనితో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. ఆ ట్వీట్‌పై ఫ్యాక్ట్ చెక్ చేసింది. అది నకిలీదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(PIB) తేల్చి చెప్పింది. ప్రధాన మంత్రి మంధన్ యోజన కింద 18-40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి కేంద్రం ఎలాంటి పెన్షన్ ఇవ్వట్లేదని వెల్లడించింది. ఈ మేరకు ఓ ట్వీట్ పోస్ట్ చేసింది.
एक ऑनलाइन फॉर्म भरने पर प्रधानमंत्री मानधन योजना के तहत केंद्र सरकार 18 से 40 साल की उम्र के लोगों को हर महीने 1800 रुपए दे रही है।#PIBFactCheck
▶️यह दावा फ़र्ज़ी है।
▶️यह एक पेंशन योजना है। लाभार्थियों को 60 साल की उम्र के बाद ही पेंशन मिलेगी।?https://t.co/B0pgsqbtDE pic.twitter.com/X8usHNjdLW
— PIB Fact Check (@PIBFactCheck) May 3, 2022
ప్రధాన మంత్రి శ్రమయోగి మాన్‌ధన్ యోజన అనేది వృద్ధాప్యంలో ఉన్న అసంఘటిత రంగంలోని కార్మికులకు సామాజిక భద్రతను అందించే ప్రభుత్వ పథకం. ఈ పథకం అసంఘటిత రంగాలలో పని చేసేవారికి, పెన్షన్ లేదా PF వంటి సామాజిక భద్రత ప్రయోజనాలను పొందలేని వారి కోసం మాత్రమే. ఈ పథకం కూలీలు, వీధి వ్యాపారులు, కష్టపడి జీవనోపాధి పొందేవారికి పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తుంది. ఈ పధకంలో చేరేందుకు వయస్సు 18-40 మధ్య ఉండాలి, అయితే పెన్షన్ మాత్రం 60 సంవత్సరాల తర్వాత మాత్రమే వస్తుంది. నెలవారీ ఆదాయం రూ. 15,000 వరకు ఉన్నవారు ఈ పథకంలో చేరవచ్చు. ఈ పథకం ద్వారా నెలకు రూ. 3000 వరకు పించన్ లభిస్తుంది. ఇది పూర్తిగా స్వచ్ఛంద పెన్షన్ పథకం. పథకంలో చేరిన వ్యక్తి ఖాతాలోకి డబ్బును భారత ప్రభుత్వం జమ చేస్తుంది. ఖాతాదారుడికి 60 ఏళ్ల వయస్సు నిండిన తర్వాత మాత్రమే పెన్షన్ వస్తుంది.