Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందండి..!

Paytm cashback offer: కస్టమర్లను ఆకట్టుకునేందుకు పేటీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ట్రాన్ఫర్ కొట్టు.. 100 పట్టు అంటోంది..

Paytm cashback offer: రూ. 4 ట్రాన్స్‌ఫర్‌ చేయండి.. రూ. 100 క్యాష్‌ బ్యాక్‌ పొందండి..!
Paytm

Updated on: Feb 17, 2022 | 9:31 AM

Paytm cashback offer: కస్టమర్లను ఆకట్టుకునేందుకు పేటీఎం అదిరిపోయే ఆఫర్ ప్రకటించింది. ట్రాన్ఫర్ కొట్టు.. 100 పట్టు అంటోంది పేటీఎం. వివరాల్లోకెళితే.. పేటీఎం కొత్తగా ప్రవేశపెట్టిన ‘‘ఫోర్‌ కా 100 ఆఫర్‌’’ ఇప్పుడు ట్రెండ్ అవుతోంది. పేటీఎం ఫ్లాట్‌ఫామ్‌పై UPI ద్వారా జరిపే నగదు బదిలీలకు క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. ఇండియా, వెస్టిండీస్‌ వన్‌డే, టెస్ట్‌ మ్యాచ్‌ల సందర్భంగా ఫిబ్రవరి 6 నుంచి 20వ తేదీ వరకు ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. అందుకు తగ్గట్టుగానే ప్రమోషనల్ అంబాసిడర్స్‌గా క్రికెటర్లు యుజ్వేంద్ర చాహల్‌, హర్భజన్ సింగ్‌, క్రిస్ గేల్‌ను ఎంపిక చేసుకుంది వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌కు చెందిన పేటీఎం.

UPI ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్స్ చెయ్యడం సేఫ్ అండ్ సెక్యూర్ అని అందరికీ తెలుసు. మామూలుగా చేస్తే మనీ మాత్రమే ట్రాన్స్‌ఫర్ అవుతుంది. అదే UPI ద్వారా పేటీఎం ఫ్లాట్‌ఫామ్‌పై చేస్తే కచ్చితంగా క్యాష్‌బాక్‌ వస్తుంది. ‘ఫోర్‌ కా 100’ ఆఫర్ అందుకోవాలంటే పేటీఎం యాప్‌లో ‘ఫోర్‌ కా 100’ ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అందులోకి వెళ్లి మీరు జస్ట్ 4 రూపాయలు మీరు ఎవరికైనా ట్రాన్స్‌ఫర్‌ చేస్తే చాలు.. 100 రూపాయలు క్యాష్‌బాక్ గెలుచుకుంటారు. ఇది కాకుండా పేటీఎంలో రిఫరల్ ప్రోగ్రామ్ ఎలాగూ ఉండనే ఉంది. అంటే.. పేటీఎంలో UPI ద్వారా నగదు బదిలీ చేయ్యొచ్చని మన బంధువులనో, స్నేహితులతో రిఫర్ కూడా చెయ్యొచ్చు. దాని ద్వారా రిఫర్ చేసిన వ్యక్తితో పాటు అవతల వ్యక్తికీ వందరూపాయల క్యాష్‌ బ్యాక్ దక్కించుకునే చాన్స్ ఉంది.

Also read:

TTD Temple: నేడు టీటీడీ బోర్డు కీలక సమావేశం.. 2022-23 టీటీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న పాలక మండలి..

Visakhapatnam: విశాఖలో మరో అంతర్జాతీయ స్థాయి వేడుక.. పీఫ్ఆర్, మిలన్ 2022 కోసం ముస్తాబవుతున్న సాగరతీరం

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కోకింగ్ కోల్ కొరత.. ఏదో కుట్ర జరుగుతోందంటున్న కార్మికులు..!