Viral: పోలీస్‌ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండ‌గా.. చివర్లో ట్విస్ట్!

మ‌నం పొర‌పాటున ప్యాంట్ జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో మ‌రిచిపోయిన రూ.50, రూ.100 నోట్‌ కంట‌ప‌డితేనే సంతోషిస్తాం..

Viral: పోలీస్‌ అకౌంట్‌లోకి రూ. 10 కోట్లు.. విత్‌డ్రా చేసేందుకు రెడీ అవుతుండ‌గా.. చివర్లో ట్విస్ట్!
Pakistani Money

Updated on: Nov 15, 2022 | 6:45 PM

మ‌నం పొర‌పాటున ప్యాంట్ జేబులోనో, హ్యాండ్‌బ్యాగ్‌లోనో మ‌రిచిపోయిన రూ.50, రూ.100 నోట్‌ కంట‌ప‌డితేనే సంతోషిస్తాం. ఇక ఓ కానిస్టేబుల్ ఖాతాలో ఏకంగా 10 కోట్ల రూపాయలు వ‌చ్చిప‌డితే అత‌డి ప‌రిస్ధితి ఎలా ఉంటుందో ఊహించుకోవ‌చ్చు. క‌రాచీలో ఓ పోలీస్ స్టేష‌న్‌లో విచార‌ణాధికారిగా ప‌నిచేసే అమిర్ గొపాంగ్ రాత్రికి రాత్రే కోటీశ్వరుడ‌య్యాడు.

అత‌డి బ్యాంక్ ఖాతాలో వేత‌నంతో పాటు రూ. 10 కోట్లు గుర్తుతెలియ‌ని సోర్స్ నుంచి క్రెడిట్ అవ‌డంతో అత‌డు ఓ ప‌ట్టాన తేరుకోలేక‌పోయాడు. తాను అంత పెద్ద మొత్తం ఎప్పుడూ చూడ‌క‌పోవ‌డంతో షాక్ తిన్నాన‌ని, త‌న ఖాతాలో ఎప్పుడూ కొన్ని వేల‌కు మించి డ‌బ్బు ఉండ‌ద‌ని గొపాంగ్ చెప్పాడు. బ్యాంకు అధికారులు త‌న‌కు కాల్ చేసి త‌న ఖాతాలో రూ. 10 కోట్లు డిపాజిట్ అయ్యాయ‌ని చెప్పడంతోనే త‌న‌కు ఈ విష‌యం తెలిసింద‌ని అన్నాడు.

ఆ డ‌బ్బును ఎలా ఖ‌ర్చు పెట్టాల‌ని ఆలోచిస్తున్నలోపే బ్యాంక్ అధికారులు గొపాంగ్ ఖాతాను ఫ్రీజ్ చేయ‌డంతో పాటు డ‌బ్బు విత్‌డ్రా చేయ‌కుండా అత‌డి ఏటీఎం కార్డును బ్లాక్ చేశారు. క‌రాచీ పోలీస్ ఖాతాలోకి ఇంత పెద్దమొత్తం ఎక్కడినుంచి ఎలా వ‌చ్చిప‌డిందో తెల‌సుకునేందుకు అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఇక గ‌తంలోనూ పాక్‌లోని ల‌ర్క‌న‌, సుక్కూర్ ప్రాంతాల్లోని పోలీసుల ఖాతాల్లో పెద్ద మొత్తంలో డ‌బ్బు క్రెడిట్ అయిన ఘ‌ట‌న‌లు జ‌రిగాయి.