
ఆప్టికల్ ఇల్యూషన్స్ చిత్రాలు మన కళ్లకు, మెదలకు పనిచెప్పడంతో పాటు, దృశ్య తీక్షణత, ఏకాగ్రతను కూడా పెంచుతాయి. అందుకే చాలా మంది వీటిని సాల్వ్ చేయడానికి ఇష్టపడుతారు. ఇలాంటి చిత్రాలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా అలాంటి ఒక చిత్రం ట్రెండింగ్‌లోకి వచ్చింది. మీకు కూడా ఇలాంటి చిత్రాలను సాల్వ్ చేసే అలవాటు ఉంటే.. ఇక్కడున్న చిత్రంలోని పిల్లిని 10 సెకన్లలో కనిపెట్టండి.
పైన ఉన్న చిత్రాన్ని చూసిన వెంటనే మీరు మొదట గందరగోళానికి గురవుతారు. ఎందుకంటే అక్కడ మీకు కేవలం కూరగాయల మొక్కలు, తీగలు మాత్రమే కనిస్తాయి. కానీ వాటి మధ్యలో ఒక పిల్లి కూడా ఉందని చాలా మంది గ్రహించరు. ఇక్కడ మీకు ఇచ్చే టాస్క్ ఏమిటంటే.. ఈ చిత్రంలో దాడి ఉన్న పిల్లిని మీరు 10 సెకన్లలోపు కనుగొనాలి. మీకు తెలివితేటలు, మంచి దృష్టి నైపుణ్యాలు, ఏకాగ్రత వహించే సామర్థ్యం ఉంటే మీరు దాగి ఇచ్చిన కాలపరిమితిలోనే కనిపెట్టవచ్చు. కాబట్టి మీరు ఈ సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉంటే.. ఈ చిత్రాన్ని ఏకాగ్రతతో జూమ్ చేసి క్షుణ్నంగా పరిశీలించండి.. అందులో దాగి ఉన్న పిల్లి మీకు కనిపిస్తుంది.
మీరు 10 సెకన్లలోపు కూరగాయల తోటలో దాక్కున్న పిల్లిని కనుగొంటే, ధన్యవాదాలు. మీకు మంచి దృశ్య నైపుణ్యాలు, ఏకాగ్రత ఉందని అర్థం. ఒక వేళ మీరు పిల్లిని గుర్తించలేకపోయినా.. ఏం పర్వాలేదు. ఎందుకంటే ఈ చిత్రంలో మిరప మొక్క వెనుక దాక్కుని ఉన్న పిల్లిని మేం ఒక సర్కిల్‌లో ఉంచాము. అక్కడ మీరు సమాధానం కనుగొనవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.