కొత్త సంవత్సరం వేడుకలను ఈసారీ ఇలా చేసుకోండి.. కరోనా సమయంలోనూ మీఇంట్లో సందడి చేయండిలా..

| Edited By: Ravi Kiran

Dec 31, 2020 | 3:19 PM

గత సంవత్సరం న్యూఇయర్ వేడుకలను ఎంతోమంది చాలా రకాలుగా ఎంజాయ్ చేశారు. కానీ ఈసారి అలా కుదరదు. కరోనా పుణ్యమా అని పండుగులు, పార్టీలు

కొత్త సంవత్సరం వేడుకలను ఈసారీ ఇలా చేసుకోండి.. కరోనా సమయంలోనూ మీఇంట్లో సందడి చేయండిలా..
Follow us on

గత సంవత్సరం న్యూఇయర్ వేడుకలను ఎంతోమంది చాలా రకాలుగా ఎంజాయ్ చేశారు. కానీ ఈసారి అలా కుదరదు. కరోనా పుణ్యమా అని పండుగులు, పార్టీలు  కూడా అందరితో కలిసి చేసుకోవాడానికి వీలు లేకుండా పోయింది. కానీ ఈ కొత్త సంవత్సరం వేడుకలను ఈ ఇంట్లోలోనే మీకు నచ్చిన వారి మధ్య సరికొత్తగా సెలబ్రెట్ చేసుకోండి. వివిధ రకాలుగా ఈ ఇంట్లో ఉన్న వస్తువులను, వంటలను సరికొత్తగా ట్రై చేసి మీకు నచ్చిన వారి మధ్య న్యూఇయర్ పార్టీ చేసుకోండి. మీకోసం కొన్ని పార్టీ డెకార్ ఐడియాస్.. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.

డిసెంబర్ 31 రోజు మీ ఇంట్లో వాళ్ళను నిద్రపోకుండా చూడండి. వారితో కలసి ప్రశాంతంగా కొత్త సంవత్సరానికి ఆహ్వనం పలకండి. అయితే ఇంట్లో ఉండే వాళ్ళు దాదాపుగా నిద్రపోవడానికి చూస్తారు. అలా కాకుండా ఇంట్లోనే చిన్నగా మ్యూజిక్ పార్టీ అరెంజ్ చేయండి. అందరితో కలిసి సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉండండి. వీటితో పాటు ఇంట్లో సభ్యులను ఉత్సహంగా ఉంచేందుకు గేమ్స్ ప్లాన్ చేయండి. ఈసారి ఇలా మీ ఇంట్లోనే న్యూఇయర్ సెలబ్రెషన్స్ కానిచ్చేయండి.

ఇక ఫ్యాన్సీ డిన్నర్ పార్టీ కంటే క్యాజువల్‏గా పార్టీ చేసుకోండి. అందుకోసం లక్కీ ఫుడ్ పార్టీ సిద్ధం చేయండి. వీటి కోసం లాంగ్ నూడుల్స్, అలసంద వంటకాలు, కుకీస్, పండ్లు, చేపలు లేదా ఏవైనా పిండి వంటలు మీ ఇంట్లోనే చేసి ఆరోగ్యకరమైన న్యూఇయర్ వేడుకలను చేసుకోండి. మీరు ఇంట్లో ఒక్కరే ఉంటున్నారా? అయితే ప్రశాంతంగా మ్యూజిక్‏తో ఎంజాయ్ చేయండి. లైట్స్ డిమ్ చేసి మ్యూజిక్ వినండి లేదా మీకు నచ్చిన పుస్తకం పుచ్చుకొని హాయిగా చదువుతూ గడిపెయండి. అంతేకాకుండా ఓ నోట్ బుక్ తీసుకోని ఈ ఏడాది మీరు చేయాలి అనుకొని చేయలేకపోయిన పనులను, వాటితోపాటు వచ్చే సంవత్సరం మీరు మొదలు పెట్టాలనుకుంటున్న పనులన్నింటిని ఆ పుస్తకంలో రాసుకోండి. ఇవే కాకుండా న్యూఇయర్ ఈవ్ ఫస్ అంటే ఇష్టం లేని వాళ్ళు న్యూఇయర్ బ్రంచ్ ప్లాన్ చేయండి. మీతో ఉన్నవారికి వాళ్ళకు ఇష్టమైన జ్యూసులు, స్మూతీలు, కుకీలు ఇచ్చి వాళ్ళను సంతోషపరచండి. ఇలా కరోనా సమయంలోనూ మీ ఇంట్లోనే ఉండి మీకు నచ్చిన వాళ్ళతో కొత్త సంవత్సరం వేడుకలను జరుపుకొండి.