2020 Round up: కరోనా కష్టకాలంలో జనాలను అలరించిన మీమర్స్.. మోస్ట్ పాపులర్‌గా నిలిచిన కాఫిన్ డ్యాన్స్..

|

Dec 30, 2020 | 2:34 PM

2020 Round up: ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కష్టంగానే గడిచిందని చెప్పాలి. సంవత్సర ప్రారంభంలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది.

2020 Round up: కరోనా కష్టకాలంలో జనాలను అలరించిన మీమర్స్.. మోస్ట్ పాపులర్‌గా నిలిచిన కాఫిన్ డ్యాన్స్..
Follow us on

2020 Round up: ఈ ఏడాది ప్రతి ఒక్కరికి కష్టంగానే గడిచిందని చెప్పాలి. సంవత్సర ప్రారంభంలో మొదలైన కరోనా మహమ్మారి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. వైరస్ వల్ల ప్రభుత్వాలు లాక్‌డౌన్ విధించడంతో ప్రజలందరు దుర్భర పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ లేని బతుకులతో కాలం వెళ్లదీస్తున్న ప్రజలకు కొంతమంది చిరు ఆనందాలను అందించారు. వారి క్రియేటివిటితో ఆనందాన్ని పంచారు. వాళ్లు ఎవరో కాదు సోషల్ స్టార్స్, మీమర్స్. లాక్‌డౌన్ నుంచి ఇప్పటి వరకు ఈ ఏడు జరిగిన ముఖ్యమైన సంఘటనలను మీమ్‌ల రూపంలో వేసి ప్రజలను నవ్వించే ప్రయత్నం చేశారు. అలాంటి సందర్భాలను ఇప్పుడు గుర్తుచేసుకుందాం.

ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది కాఫిన్ డ్యాన్స్ గురించే. ఈ వీడియో సోషల్‌మీడియాలో ఒక ట్రెండ్ క్రియేట్ చేసింది. ఘనాకు చెందిన ఆరుగురు వ్యక్తులు శవపేటికను మోస్తూ చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అయ్యారు.ఈడీఎమ్ ట్రాక్ ఆస్టోనోమియాను సింక్ చేసి విడుదల చేసిన వీడియోను వివిధ సందర్భాల్లో మీమర్స్ విచ్చలవిడిగా వాడేసుకున్నారు. అందుకే 2020 గూగుల్ గ్లోబల్ ఇయర్ సెర్చ్‌లో ఇది మోస్ట్ పాపులర్ డ్యాన్స్‌గా నిలిచింది. తర్వాత స్థానం కరోనా వైరస్‌దే అని చెప్పాలి. దీనిని సందర్భంగా చేసుకొని అటు చైనాలోని వూహాన్ మీద, ఇటు ప్రపంచ వ్యాప్త లాక్‌డౌన్ మీద కోట్ల సంఖ్యలో మీమ్‌లు పుట్టుకొచ్చాయి. వర్క్ ఫ్రం హోమ్, శానిటైజర్, మాస్క్‌లు, సోషల్ డిస్టెన్స్, వ్యాక్సిన్ తయారీ, రామాయణ, భారత పునప్రసారాలపై ఆసక్తి చూపారు. అలాగే ప్రధాని మోదీ ఉపన్యాసాలు, జనతా కర్ఫూ, చప్పట్లు కొట్టడం, దీపాలు వెలిగించడం, గో కరోనా గో, లాంటి వాటిపై కూడా మీమ్‌లు వేసి అలరించారు.

తర్వాత అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన టెన్షన్ వాతావరణంతో మూడో ప్రపంచ యుద్దం వస్తుందనుకున్నారు. అలాంటిదేమి జరగకపోవడంతో దానిపైన కూడా మీమర్స్ ఓ చూపు చూశారు. వరల్డ్ వార్ 3 పేరుతో మీమ్‌లు పుట్టుకొచ్చాయి. ఇక పాప్ కల్చర్ విషయానికొస్తే స్లే పాయింట్ యూట్యూబ్ ఛానెల్‌ కామెంట్‌లో ఉన్న ‘బినోద్’ అనే పేరుపై వచ్చిన మీమ్‌లు బాగా ట్రెండ్ అయ్యాయి. అంతేకాకుండా సాథ్ నిబానా సాథియా (కోడలా కోడలా కొడుకు పెళ్లామా) సీరియల్‌లో కిచెన్‌లో ఉన్నదెవరూ? అంటూ యశ్‌రాజ్ సృష్టించిన జింగిల్ అతనికి ఒక్కరాత్రిలోనే ఫేమ్‌ను సంపాదించిపెట్టింది. అలాగే టిక్ టాక్ బ్యాన్ గురించి విచ్చలవిడిగా మీమ్‌లు పుట్టుకొచ్చాయి. ఇందులో ఫేమస్ అయిన వారి గురించి ఎన్నో ఫన్నీ మీమ్‌లు వచ్చాయి. ఇంకా పబ్జీ బ్యాన్ అయినపుడు కూడా ఇలాంటి మీమ్‌లే ట్రెండ్ అయ్యాయి. స్పేస్ ఎక్స్ అధినేత తన కొడుకుకు పెట్టిన పేరు గురించి వచ్చిన మీమ్‌లు అందరిని నవ్వించాయి. అంతేకాకుండా ప్రకృతిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా జీవిస్తున్నందుకే ఇలాంటి పరిస్థితి వచ్చిందని, ప్రకృతి పగ తీర్చుకుంటుందని సందేశాన్నిస్తూ ‘నేచర్ హీజ్ హీలింగ్’ మీమ్స్ ట్రెండింగ్‌లో నిలిచాయి. ఇంకా చాలా మీమర్స్ కరోనా కాలంలో పలువురిని ఆకట్టుకున్నాయి.