Viral Video: ఏకకాలంలో రెండు పనులు.. ఓ వైపు వంట.. మరోవైపు వేడి నీళ్లు.. ఆకట్టుకుంటున్న జుగాడ్ పొయ్యి..

|

Jan 05, 2024 | 11:15 AM

జుగాడ్ తయారీ విషయంలో భారతీయుల తెలివి తేటల గురించి ప్రపంచానికి రకరకాల వీడియోల ద్వారా పరిచయమే.. బడా బడా ఇంజనీర్లు కూడా ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతారు.. ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో అందుకు సజీవ సాక్ష్యం. ఓ వ్యక్తీ తన తెలివి తేటలను ఉపయోగించి జుగాడ్ స్టవ్‌ను తయారు చేశారు.. ఆ పొయ్యి ఏకకాలంలో రెండు రకాల పనులు చేస్తుంది. ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవచ్చు.. అదే సమయంలో మరోవైపు వేడి నీరు మరిగించుకోవచ్చు.

Viral Video: ఏకకాలంలో రెండు పనులు.. ఓ వైపు వంట.. మరోవైపు వేడి నీళ్లు.. ఆకట్టుకుంటున్న జుగాడ్ పొయ్యి..
Video Viral
Follow us on

శీతాకాలం కనుక దేశంలోని వివిధ ప్రాంతాల్లో చలి విపరీతంగా ఉంది. అనేక ప్రాంతాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత పెరగడంతో ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. అటువంటి పరిస్థితిలో తీవ్రమైన చలి నుంచి ఉపశమనం కోసం కొందరు మంటలు ఏర్పాటు చేసుకుంటే.. మరికొందరు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో స్నానం చేయమంటే.. చలికి గజగజా వణుకుతాడు. అబ్బో చన్నీళ్లతో స్నానం మా వల్ల కాదు.. అంటూ వేడి నీటితో స్నానం చేయడానికి సిద్దమవుతాడు. లేదంటే అసలు స్నానం వద్దు అంటూ స్నానం చేయకుండా ఉండటానికి ప్రయత్నిస్తాడు. ఈ నేపధ్యంలో ప్రస్తుతం ఓ దేశీ జుగాడ్ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక వ్యక్తి శీతాకాలంలో వేడి నీరు రెడీ అవ్వడానికి గొప్ప పరిష్కారాన్ని కనుగోనన్నాడు.. అదే సమయంలో స్నానంతో పాటు వంట కూడా చేసుకునే వీలుంది. ఈ దేశీ జుగాడ్ లో..

జుగాడ్ తయారీ విషయంలో భారతీయుల తెలివి తేటల గురించి ప్రపంచానికి రకరకాల వీడియోల ద్వారా పరిచయమే.. బడా బడా ఇంజనీర్లు కూడా ఈ టెక్నాలజీని చూసి ఆశ్చర్యపోతారు.. ప్రశంసల వర్షం కురిపిస్తారు. ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియో అందుకు సజీవ సాక్ష్యం. ఓ వ్యక్తీ తన తెలివి తేటలను ఉపయోగించి జుగాడ్ స్టవ్‌ను తయారు చేశారు.. ఆ పొయ్యి ఏకకాలంలో రెండు రకాల పనులు చేస్తుంది. ఈ కట్టెల పొయ్యి మీద వంట చేసుకోవచ్చు.. అదే సమయంలో మరోవైపు వేడి నీరు మరిగించుకోవచ్చు. ఈ పొయ్యి మీద వంటతో పాటు వేడి నీటిని కూడా పెట్టుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

జుగాడ్ కట్టెల పొయ్యి వీడియో

వీడియోలో ఒక స్టవ్ లాంటి కట్టెల పొయ్యి ఉంది.. దీనికి ఒక వైపు పైపు ఉన్నట్లు చూడవచ్చు. ఇందులో ఒకవైపు నుంచి చల్లటి నీరు పోస్తే, మరోవైపు నుంచి వేడి వేడిగా వస్తుంది. అదే సమయంలో హ్యాపీగా వంటకూడ చేసుకోవచ్చు. ఆహార పదార్ధాలను తాయారు చేయడానికి కట్టెలను పొయ్యిలో మండిస్తుంటే.. ఆ వేడికి మరోవైపు నీరు వేడెక్కి.. వంట చేసేటప్పుడు వేడినీళ్లు వస్తుంది.. ఇందుకు మరో స్టవ్ కానీ.. మరిన్ని కట్టెలు కానీ ఉపయోగించాల్సిన అవసరం లేదు.

ఈ వీడియో @Babymishra అనే ఖాతా ద్వారా Xలో భాగస్వామ్యం చేయబడింది. ఇప్పటి వరకూ లక్ష మందికి పైగా వ్యూస్ ని సొంతం చేసుకోగా.. భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ‘గ్రామంలో ఇటువంటి జుగాడ్ సమయం ఆదా చేయడమే కాదు ఎక్కువ ఖర్చు చేయకుండానే ప్రజల పనిని సులభతరం చేస్తుంది.’ అని కామెంట్ చేయగా.. మరొకరు ఈ జుగాడ్ అద్భుతమైనది సోదరా..! అని ప్రశంసలను కురిపించారు.

మరిన్ని  ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..