Ratan Tata Boidata: ఆ జాబ్ కోసం రెజ్యూమ్ లేదట.. ఆనాటి అందమైన క్షణాలను గుర్తు చేసుకున్న రతన్ టాటా..

Ratan Tata Boidata: 155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా నేడు ప్రపంచంలోనే సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ మెన్‌గా గుర్తింపు పొందారు. అయితే, రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించాడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా మారింది. రతన్ టాటాకు మొదటి జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు.. ఆయన తన రెజ్యూమ్‌ను ఎలా ప్రిపేర్ చేశారు? మొదటి ఉద్యోగాన్ని ఎలా పొందారు?

Ratan Tata Boidata: ఆ జాబ్ కోసం రెజ్యూమ్ లేదట.. ఆనాటి అందమైన క్షణాలను గుర్తు చేసుకున్న రతన్ టాటా..
Ratan Tata

Updated on: Sep 04, 2023 | 5:43 AM

155 ఏళ్ల టాటా గ్రూప్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లిన రతన్ టాటా నేడు ప్రపంచంలోనే సక్సెస్‌ఫుల్ బిజినెస్‌ మెన్‌గా గుర్తింపు పొందారు. అయితే, రతన్ టాటా కూడా ఉద్యోగిగా తన కెరీర్‌ను ప్రారంభించాడని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ట్రిలియన్ డాలర్ల వ్యాపారంగా మారింది. రతన్ టాటాకు మొదటి జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు.. ఆయన తన రెజ్యూమ్‌ను ఎలా ప్రిపేర్ చేశారు? మొదటి ఉద్యోగాన్ని ఎలా పొందారు? వంటి వెరే రేర్ అండ్ ఇంట్రస్టింగ్ వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రతన్ టాటా మొదటి బయోడేటా..

విదేశాల్లో విద్యనభ్యసించిన రతన్ టాటా కొంతకాలం తరువాత భారత్‌కు తిరిగి వచ్చారు. ఆ తరువాత రతన్ టాటాకు IBM లో ఉద్యోగం వచ్చింది. అయితే, ఆయన సన్నిహితులైన జేఆర్‌డీ టాటా.. రతన్ టాటా నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తి చేశారట. ఇదే విషయమై రతన్ టాటాకు జేఆర్డీ టాటా ఫోన్ చేశారట. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాలన్నీ వెల్లడించారు రతన్ టాటా. ‘ఆయన ఒక రోజు నాకు ఫోన్ చేసి.. మీరు భారత్‌కు వచ్చి ఐబీఎంలో ఎందుకు పని చేస్తున్నారు. టాటా గ్రూప్‌లో ఉద్యోగం కోసం ఒక రెజ్యూమ్ పంపించండి’ అని అడిగారు. దాంతో ఆ జాబ్‌ కోసం రతన్ టాటా రెజ్యూమ్ పంపాల్సి వచ్చింది. అయితే, ఆ సమయంలో రతన్ టాటా వద్ద రెజ్యూమ్ లేదట. దాంతో IBM లో పని చేస్తూనే.. ఆఫీస్‌లో ఉన్న ఎలక్ట్రిక్ టైప్‌రైటర్‌పై తన రెజ్యూమ్‌ను రూపొందించారట రతన్ టాటా. ఓ సాయంత్రం వేళ దీని కోసం ప్రత్యేకంగా కూర్చుని టైప్ రైటర్ మీద రెజ్యూమ్ టైప్ చేసి జేఆర్‌డీ టాటాకు ఇవ్వడం జరిగిందని రతన్ టాటా చెప్పుకొచ్చారు.

1962లో మొదటి ఉద్యోగం..

తన రెజ్యూమ్‌ను షేర్ చేసిన తరువాత.. రతన్ టాటాకు 1962లో టాటా ఇండస్ట్రీస్‌లో ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం పొందిన దాదాపు మూడు దశాబ్దాల తర్వాత. 1991లో జేఆర్‌డీ టాటా చనిపోయారు. ఆ తరువాత రతన్ టాటా ‘టాటా’ గ్రూప్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం దినదినాభివృద్ధి చెంది.. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ బిలియనీర్లలో రతన్ టాటా ఒకరుగా నిలిచారు.

టాటా కంపెనీని కొత్త శిఖరాలకు తీసుకెళ్లిన టాటా గ్రూప్ చైర్మన్‌గా రతన్ టాటా చాలా మందికి తెలుసు. అయితే రతన్ టాటా ఒక ఐటీ సంస్థలో పనిచేయాలనుకుంటున్నారని, JRD టాటా స్వయంగా ఆయన్ను టాటా గ్రూప్‌లో చేరమని ఒప్పించారని చాలా తక్కువ మందికి తెలుసు.

అయితే, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మళ్లీ వైరల్ అవుతున్న పాత వీడియోలో టాటా గ్రూప్‌లో రతన్ టాటా ఉద్యోగం పొందడానికి తన CVని ఎలా రూపొందించారో వెల్లడించారు. ఉద్యోగానికి ముందు రతన్ టాటా కార్నెల్ విశ్వవిద్యాలయం నుండి ఆర్కిటెక్చర్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో పట్టా సాధించారు. లాస్ ఏంజిల్స్‌లో స్థిరపడటానికి సిద్ధమయ్యారు కూడా. ఈ సమయంలోనే.. రతన్ టాటా అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో ఆయన భారతదేశానికి తిరిగి రావాల్సి వచ్చింది. అలా వచ్చిన రతన్ టాటా నేతు భారత్‌లోనే కాదు.. యావత్ ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ప్రత్యేకతను నిరూపించుకున్నారు.

మరిన్ని హ్యూమన్‌ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..