ఐబీపీఎస్ పీఓ మెయిన్ ఎగ్జామ్‌ 2021: ఈ పరీక్షలో అత్యధిక స్కోరు సాధించాలనుకుంటున్నారా! అయితే ఈ సూచనలు గమనించండి..

IBPS PO main exam 2021: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్ పీఓ) ప్రధాన పరీక్ష మరి కొద్ది గంటల్లో జరగబోతుంది.

ఐబీపీఎస్ పీఓ మెయిన్ ఎగ్జామ్‌ 2021: ఈ పరీక్షలో అత్యధిక స్కోరు సాధించాలనుకుంటున్నారా! అయితే ఈ సూచనలు గమనించండి..

Updated on: Feb 04, 2021 | 9:34 AM

IBPS PO main exam 2021: ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్ పీఓ) ప్రధాన పరీక్ష మరి కొద్ది గంటల్లో జరగబోతుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరూ చివరి దశలో ఉన్నారు. అయితే ప్రిలిమినరీ కంటే మెయిన్ కొద్దిగా కఠినంగా ఉంటుంది కనుకు అభ్యర్థులందరు తగిన ప్రణాళికతో పరీక్షకు సిద్దం కావాల్సి ఉంటుంది. మెయిన్స్‌లో అత్యధిక స్కోరు సాధించాలంటే సరైన సూచనలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వాటిని ఒకసారి పరిశీలిద్దాం.

పరీక్షకు వెళ్లేముందు అభ్యర్థులు ముందుగా ప్రశాంతంగా ఉండాలి. దాదాపుగా ఒకరోజు ముందుగానే చదివినవన్ని రివైజ్ చేసుకోవాలి. ప్రశ్నాపత్రాన్ని జాగ్రత్తగా చదివి ప్రశ్నల సరళిని సరిగ్గా అర్థం చేసుకోవాలి. సరైన సమాధానం ఇవ్వాలి. బుక్‌లెట్‌ను పూర్తిగా చదవడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే సమయం తక్కువగా ఉంటుంది కనుక జాగ్రత్తగా వ్యవహరించాలి. పక్కా ప్రణాళికతో ముందుకు వెళితే కట్ ఆఫ్ మార్కుల కంటే ఎక్కువగానే స్కోరు సాధించవచ్చు.

పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు చివరగా ఈ సూచనలు పాటించాలి. పరీక్ష సమయం గంట కేటాయిస్తారు. ఇందులో రెండు విభాగాలుగా చేసుకొని మొదటి అర్దగంటలో సులభంగా వచ్చిన ప్రశ్నలకు జవాబులు కేటాయించాలి. రెండో అర్ధగంటలో ఎక్కువగా సమయం తీసుకుంటుదన్న ప్రశ్నలు అనగా అంకగణిత మరియు ఉన్నత-స్థాయి డేటా, తదితర ప్రశ్నలను చేయడానికి ప్రయత్నించాలి. ఇక ముఖ్యంగా ఈ పరీక్షలో ఎక్కువ స్కోరు సాధించాలంటే లాజికల్ రీజనింగ్, సిట్టింగ్ అమరిక, రివర్స్ సిలోజిజం, డేటా సమృద్ధి, తదితర వాటిపై దృష్టి సారించాలి. సీటింగ్ అమరిక ఆధారంగా ప్రశ్నలను పరిష్కరించేటప్పుడు, బహుళ రేఖాచిత్రాలు గీయవద్దు. సమయం వృథా అవుతుంది. ఇక ఏదైనా పజిల్‌కు సంబంధించిన ప్రశ్నకు జవాబు తెలియక పోతే దానిని విడిచిపెట్టడం ఉత్తమం. అలాగే కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 5-6 ప్రశ్నలు ఉంటాయి.

జనరల్ నాలెడ్జ్‌లో మొత్తం 40 ప్రశ్నలు అడుగుతారు. గత 3-4 నెలల్లో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా జరిగిన సంఘటనల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్‌బిఐకి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా వార్తలు, అవార్డులు, ఇటీవలి నియామకాలు. స్టాటిక్ జికెలో, గత 3-4 నెలల్లో వార్తల్లో ఉన్న దేశాలను కవర్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఇంగ్లీష్‌పై పట్టుఉంటే మీకు కలిసి వస్తోంది. ఎక్కువ స్కోరు చేయడానికి అవకాశం దొరుకుతుంది. గ్రామర్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక ముఖ్యంగా ఈ పరీక్షలో ఆర్థిక రంగం, సామాజిక సమస్యలు, మహిళా సాధికారత, ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు ఆధారంగా చేసుకొని ప్రశ్నాపత్రం రెడీ అవుతుందని అభ్యర్థులు గమనించాలి.

సీబీఎస్ఈ 2021 పరీక్షల తేదీలు ఖరారు.. జనవరి 1 నుండి 12వ తరగతి ప్రాక్టికల్స్..!