Trending News: మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. మగాళ్లకు సమానంగా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ దూసుకుపోతున్నారు. తాజాగా భార్య భర్తల మధ్య ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఇంతకాలం జిల్లా వ్యవహారాల్ని నేను చూశా. ఇక మీ వంతు వచ్చింది. జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ భర్తకు జిల్లాను అప్పగించారు ఓ మహిళ. జిల్లాను భర్తకు అప్పగించడం ఏంటి అను అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదవాల్సిందే. కేరళలోని అలప్పుళ జిల్లా కలెక్టరేట్ మంగళవారం ఈ అరుదైన ఘటనకు వేదికైంది.
రేణురాజ్.. ఇప్పటివరకు కేరళలోని అలప్పుళ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అయితే తాజాగా ఆమెను బదిలీ చేస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రేణు స్థానంలో శ్రీరామ్ వెంకట్రామన్‌ను కొత్త కలెక్టరుగా నియమించింది. రేణు, శ్రీరామ్.. భార్యాభర్తలు కావడం ఇక్కడ విశేషం. మొదట్లో డాక్టర్లు అయిన వీరిద్దరూ తర్వాత ఐఏఎస్ అధికారులుగా మారి, ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లి చేసుకున్నారు. కేరళ ప్రభుత్వంలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న శ్రీరామ్ ఇపుడు జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. తాజాగా అలప్పుళ కలెక్టర్‌గా భార్య స్థానాన్ని భర్తీ చేశారు శ్రీరామ్.