స్మార్ట్‌ఫోన్‌లో బ్యాటరీ అయిపోవడంతోనే మనం ఛార్జింగ్ పెట్టేస్తాం. అయితే ఇందరు ఇలా చేయరు.. అందులోని చార్జింగ్ పూర్తిగా అంటే జీరో వరకు వచ్చి ఆగిపోయిన తర్వాతే చార్జింగ్ పెడతారు. ఇక కొందరు చార్జింగ్ పెట్టి రాత్రంతా ఫోన్లను అలాగే వదిలేస్తారు. ఇలా స్మార్ట్‌ఫోన్లను చాలా మంది రక రకాలుగా ఛార్జింగ్ పెడుతుంటారు. దీంతో ఏదో ఒక సమయంలో ఫోన్ బ్యాటరీ కచ్చితంగా పనిచేయడం మానేస్తుంది. లేదా కరెక్ట్‌గా పనిచేయదు. దీంతో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే అసలు ఏ ఫోన్‌కైనా ఛార్జింగ్ ఎలా పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, ఎంత వరకు ఛార్జింగ్ పెడితే మంచిది.. స్మార్ట్‌ఫోన్ ప్రతిరోజూ అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటుంటే.. ఇలాంటి సమస్యలను వదిలించుకోవడానికి ఇక్కడ కొన్ని చిట్కాలను తెలుసుకుందాం..
దీని వల్ల స్మార్ట్ ఫోన్ లైఫ్ పెరగడమే కాకుండా స్పీడ్ కూడా పెరుగుతుంది. స్మార్ట్‌ఫోన్ సరిగ్గా ఛార్జ్ చేయకపోయినా.. మీ స్మార్ట్‌ఫోన్ జీవితకాలం తగ్గిపోతుంది. మీరు ఏదైనా ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేస్తే ఇలా చేయకండి. ఎక్కువ లేదా తక్కువ పవర్ ఉన్న ఛార్జర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను ఛార్జ్ చేసినప్పుడు.. బ్యాటరీ పేలిపోతుందనే భయం మాత్రమే కాకుండా, ఛార్జింగ్ వేగం కూడా తగ్గుతుంది.
మీ స్మార్ట్‌ఫోన్‌కు సుదీర్ఘ జీవితాన్ని ఇవ్వాలనుకుంటే.. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ నుంచి భారీ గేమ్ యాప్‌లను తొలగించండి. ఎందుకంటే దీని కారణంగా ప్రాసెసర్‌పై చాలా ఒత్తిడి పడుతుంది. స్మార్ట్‌ఫోన్ లైఫ్, బ్యాటరీ ఆరోగ్యం తగ్గుతుంది.
మీ స్మార్ట్‌ఫోన్‌లో మీకు ఉపయోగం లేదా యాప్‌లు ఉంటే.. వెంటనే వాటిని తొలగించండి. ఈ యాప్‌లు మీ స్మార్ట్‌ఫోన్‌లోని స్థలాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. ఇది స్మార్ట్‌ఫోన్‌ను స్లోగా మార్చేస్తుంది. అవసరం అనుకున్న యాప్‌లను మాత్రమే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉంచండి. మీరు మీ స్మార్ట్ ఫోన్‌లో ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేస్తుంటే, గూగుల్ ప్లే స్టోర్‌ను ఉపయోగించడానికి ప్రయత్నించండి. మీరు అనధికార వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేస్తే.. అప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు నష్టం జరిగే అవకాశం ఉంది.
కొంతమంది వినియోగదారులు స్మార్ట్‌ఫోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో యాప్‌ను రన్ చేస్తూ వదిలేస్తారు. మీరు కూడా ఇలా చేస్తే, చేయకండి. దీని కారణంగా ఇంటర్నెట్ చాలా ఖర్చు అవుతుంది. దీనితో పాటు, ప్రాసెసర్‌పై ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా దాని వేగం తగ్గవచ్చు.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం