
బంగార అనేది భారతీయులకు ప్రత్యేక సెంటిమెంట్. ధరలు పెరిగినా, తగ్గినా బంగారాన్ని కొంటూనే ఉంటారు. ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అయితే చాలామంది పెళ్ళిళ్లకు లేదా శుభకార్యాలకు రైలులో బంగారం తీసుకెళ్తుంటారు. అయితే ట్రైన్‌లో ఎంత బంగారం తీసుకెళ్లవచ్చు. బంగారం తీసుకెళ్లడానికి ఏమైనా ప్రత్యేక రూల్స్ ఉన్నాయా అనే చాలా మందికి ఉంటుంది. ఇండియన్ రైల్వేస్ రూల్స్ ఎలా ఉన్నాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రైల్వేల దృష్టిలో బంగారం అనేది ఒక సాధారణ లగేజీ మాత్రమే. బంగాన్ని స్పెషల్‌గా చూడదు. దీనికి ఎలాంటి ప్రత్యేక అనుమతి అవసరం లేదు. మీరు మీ టికెట్‌కి ఎంత లగేజీ తీసుకెళ్లడానికి పర్మిషన్ ఉందో, ఆ పరిమితిలోనే బంగారాన్ని కూడా తీసుకెళ్లవచ్చు.
మీరు ఈ లగేజీ పరిమితిని మించితే అదనపు ఛార్జీలు లేదా జరిమానాలు విధించే అవకాశం ఉంటుంది.
మీరు చాలా ఎక్కువ మొత్తంలో బంగారం తీసుకెళ్తుంటే.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని విషయాలను గుర్తుంచుకోమంటుంది. ధరించిన బంగారంపై లిమిట్ లేదు. అంటే మీరు మెడలో వేసుకున్నదానిపై ప్రత్యేక నిబంధన లేదు. అయితే పెద్ద మొత్తంలో తీసుకెళ్తే, ఆ బంగారం ఎలా కొన్నారు అనే దానికి సంబంధించిన బిల్లులు కచ్చితంగా మీ దగ్గర పెట్టుకోండి. ఇది అవసరమైతే అధికారులకు చూపించడానికి హెల్ప్ అవుతుంది.
రైలులో దొంగతనం జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి
హ్యాండ్ బ్యాగ్‌లో మాత్రమే: బంగారాన్ని ఎప్పుడూ మీ చేతిలో ఉండే చిన్న బ్యాగ్‌లో పెట్టుకోండి. పెద్ద సూట్‌కేసుల్లో వద్దు.
పక్కనే ఉంచుకోండి: ప్రయాణం అంతా ఆ బ్యాగ్ మీ కళ్లముందే, మీ దగ్గరలోనే ఉండేలా చూసుకోండి.
విభజించి తీసుకెళ్లండి: ఒకే బ్యాగ్‌లో అంతా పెట్టకుండా ఎక్కువ బంగారం ఉంటే చిన్న చిన్న ప్యాకెట్లుగా విడదీసి, వేరే చోట్ల కూడా పెట్టుకోవడం మరింత సురక్షితం.
రైలులో బంగారం తీసుకెళ్లడం తప్పు కాదు. మీ లగేజీ లిమిట్ చూసుకుని, బిల్లులు దగ్గర పెట్టుకుని, భద్రత పాటించండి. మీ ప్రయాణం సురక్షితంగా ఉంటుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..