Haunted Places: ఎడారి మధ్యలో ఒక అందమైన నగరం. రాజస్థాన్‌లోని జైపూర్ పేరు వినగానే ముందుగా అందమైన ప్యాలెస్, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కోట, అత్యుత్తమ విలాసవంతమైన ప్యాలెస్ వంటివి గుర్తుకు వస్తాయి. ఏటా లక్షల సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వచ్చే నగరం ఇది. కానీ ఈ నగరంలో చాలా భయానక ప్రదేశాలు ఉన్నాయని బలంగా నమ్ముతారు. రాత్రిపూట ఈ ప్రదేశాలకు ఎవ్వరు కూడా వెళ్లరు. సూర్యుడు అస్తమించిన వెంటనే ఇక్కడి నుంచి పర్యటకులు వెళ్లిపోతారు. ఒక్కరు కూడా ఉండేందుకు సహసించరు. అయితే జైపూర్ (Jaipur)లోని కొన్ని భయానక ప్రదేశాల గురించి మేము మీకు చెప్పబోతున్నాము.
జగత్‌పురా (Jagatpura):
జగత్‌పురా.. బహుశా మీరు ఈ ప్రదేశం పేరు పెద్దగా విని ఉండరు. కానీ జైపూర్‌లోని ఈ ప్రదేశాలు ఒకదానికొకటి భయానక కథలకు ప్రసిద్ధి చెందాయి. సాయంత్రం కాగానే ఇంటి నుంచి బయటకు రావడానికి భయపడతారని చెబుతుంటారు. దీని వెనుక చాలా కారణాలున్నాయి. రాత్రి చీకటిలో ఏవేవో తిరుగుతాయని స్థానిక ప్రజలు నమ్ముతారు. ఇక్కడ శిథిలమైన భవనం నుండి వింత శబ్దాలు వస్తాయని కూడా కొందరు నమ్ముతారు.
కుల్దారా గ్రామం (Kuldhara):
కులధార గ్రామ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ గ్రామం 171 సంవత్సరాలకు పైగా జన సంచారం లేకుండా నిర్మానుషంగా మారింది. ఇప్పుడు మీరు దీన్ని బట్టి ఈ ప్రదేశాన్ని ఎవరూ సందర్శించరని ఊహించవచ్చు. ఇక్కడ ఎవరూ ఒంటరిగా వెళ్లడానికి సాహసించరు. ఈ నిర్మానుష గ్రామం నుండి రాత్రి వేళల్లో ఆడవాళ్ళ స్వరం, కంకణాల శబ్ధం వినిపిస్తున్నాయి. కొన్ని కారణాల వల్ల స్థానిక ప్రజలు ఈ గ్రామాన్ని ఖాళీ చేశారని, అప్పటి నుండి అది ఎడారిగా మారిందని అక్కడి ప్రజలు చెబుతుంటారు.
ఢిల్లీ-జైపూర్ హైవే (Delhi–Jaipur Highway)
భయానక ప్రదేశాలలో ఢిల్లీ-జైపూర్ రహదారి కూడా ఒకటి. ఈ రహదారి గురించి ఒకటి కాదు చాలా కథనాలు ఉన్నాయి. అవేంటంటే.. ఈ రహదారిపై రాత్రిపూట ఎర్రటి చీర కట్టుకుని ఒక స్త్రీ తిరుగుతూ ఉంటుందని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. దీని కారణంగా సాయంత్రం కాగానే అటువైపు వెళ్లేందుకు భయపడతారు.
నహర్‌ఘర్ కోట (Nahar Garh)
నహర్‌ఘర్ కోట కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కోటను నిర్మించేటప్పుడు చేతివృత్తులవారు గోడను నిర్మించేవారని, మరుసటి రోజు పనికి వెళ్లినప్పుడు కోట గోడ కూలిపోయిందని చెబుతుంటారు. ఆరావళి కొండల అంచున ఉన్నందున రాత్రిపూట ఇక్కడికి వెళ్లరు. కొన్నిసార్లు ఎవరూ పగటిపూట కూడా ఒంటరిగా వెళ్ళడానికి ప్రయత్నించరు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి