Vastu Tips: తులసి మొక్క విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.?

అందుకే ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. తులసి మొక్క వాడిపోయినా, సరిగ్గా ఎదగకపోయినా ఇంట్లో ఏదో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని భావిస్తుంటారు. అందుకే ఈ మొక్కను అత్యంత జాగత్తగా పెంచుతుంటారు. ఇంట్లోని నెగిటివ్‌ ఎనర్జీ రాకుండా చేయడంలో తులసి ఉపయోగపడుతుందని విశ్వసిస్తుంటారు. అయితే తులసి విషయంలో కూడా...

Vastu Tips: తులసి మొక్క విషయంలో ఈ తప్పులు చేస్తున్నారా.?
Tulsi Plant Vastu
Follow us

|

Updated on: Jul 06, 2024 | 5:03 PM

తులసి మొక్కకు ఎలాంటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా హిందూ మతంలో తులసి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారు. తులసి మొక్కను దైవంగా భావిస్తారు. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా కొలుస్తుంటారు. ఇక తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసిలోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయని నిపుణులు సైతం చెబుతుంటారు.

అందుకే ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా జాగ్రత్తపడుతుంటారు. తులసి మొక్క వాడిపోయినా, సరిగ్గా ఎదగకపోయినా ఇంట్లో ఏదో నెగిటివ్‌ ఎనర్జీ ఉందని భావిస్తుంటారు. అందుకే ఈ మొక్కను అత్యంత జాగత్తగా పెంచుతుంటారు. ఇంట్లోని నెగిటివ్‌ ఎనర్జీ రాకుండా చేయడంలో తులసి ఉపయోగపడుతుందని విశ్వసిస్తుంటారు. అయితే తులసి విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. తులసి మొక్కను ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకూడదని చెబుతున్నారు. ఇంతకీ తులసి మొక్క విషయంలో పాటించాల్సిన ఆ వాస్తు నియమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తులసి మొక్కను వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే నాటాలని చెబుతున్నారు. ఉదయాన్ని వచ్చే లేలేత సూర్య కిరణాలు మొక్కపై పడేలా ఉండాలని సూచిస్తున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఉత్తరం దిశలో వీలు కాకపోతే ఈశాన్యం దిశలో ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. ఈశాన్యం దిశకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి ఈ దిశలో మొక్క నాటి రోజూ పూజిస్తే మంచి జరుగుతుందని చాలా మంది విశ్వసిస్తారు. వాస్తు పండితులు కూడా ఇదే విషయాన్ని చెబుతారు.

ఇక తులసి మొక్కను పొరపాటున కూడా దక్షిణ దిశలో నాటకూడదు. ఎందుకంటే ఈ దిక్కును పూర్వీకుల దిక్కుగా భావిస్తుంటారు. కాబట్టి ఈ దిశలో తులసి మొక్క నాటకూడదు. ఇలా చేస్తే కుటుంబంలో కలహాలు పెరిగి, నిత్యం గొడవలకు దారి తీస్తుంది. ఇక శుక్రవారం తులసి మొక్కను నాటితే మంచి జరుగుతుందని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ఇక తులసి చెట్టు పక్కన ఎట్టి పరిస్థితుల్లో ముళ్ల చెట్లు లేకుండా చూసుకోవాలి. దీనివల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు. సూర్య, చంద్ర గ్రహణాలు వచ్చే రోజున తులసి మొక్కను చేతితో తాకకూడదని వాస్తు పండితులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు వాస్తు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి…