చౌకైన ప్లాన్‌తో 52 రోజుల వ్యాలిడిటీ..బీఎస్‌ఎన్‌ఎల్‌లో బెస్ట్‌ ప్లాన్‌!

05 October 2024

Subhash

ఇటీవల నుంచి జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌ ఐడియా రీఛార్జ్‌ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఎలాంటి టారీఫ్‌లు పెంచలేదు.

జియో, ఎయిర్‌టెల్‌, వోడాఫోన్‌

ప్రైవేట్‌ టెలికాం కంపెనీల టారీప్‌ ధరలు పెరిగిన తర్వాత లక్షలాది మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌ వైపు వెళ్తున్నారు. దీంతో బీఎస్‌ఎన్‌ఎల్‌కు కలిసి వస్తోంది.

ప్రైవేట్‌ టెలికాం కంపెనీలు

1GB రోజువారీ డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చౌకైన ప్లాన్‌ జియోతో పోలిస్తే ఈ ప్లాన్‌లు సగం ధరకే వస్తాయి. బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్లాన్‌లు జియో మాదిరిగానే చెల్లుబాటు, కాల్‌లను అందిస్తాయి.

1 GB రోజువారీ డేటా

భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ 52 రోజుల చెల్లుబాటుతో రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. ఇందులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. 

52 రోజుల చెల్లుబాటుతో

బీఎస్‌ఎన్‌ఎల్‌ తన వినియోగదారులకు 298 రూపాయల రీఛార్జ్ ప్లాన్‌తో అపరిమిత కాల్స్‌,  డేటాతో పాటు మరెన్నో ప్రయోజనాలను అందిస్తుంది.

రూ.298 రీఛార్జ్ ప్లాన్‌తో

అపరిమిత కాలింగ్, అపరిమిత డేటాతో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఈ ప్రీపెయిడ్ ప్లాన్ 52 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ప్యాక్ లోకల్, ఎస్టీడీలో అపరిమిత వాయిస్ కాల్‌లను అందిస్తుంది. 

 వాలిడిటీ 52 రోజులు:

ఇందులో రోజుకు 1GB డేటాతో పాటు రోజుకు 100 SMSల సౌకర్యం ఉంది. ఈ ప్లాన్‌లో Eros Now వినోద సేవలకు ఉచిత సభ్యత్వం కూడా ఉంది.

రోజుకు 1GB డేటా

అపరిమిత డేటా, ఎక్కువ కాలం కాల్ చేయాలనుకునే వారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. కస్టమర్లను మరింతగా ఆకర్షించేందుకు రకరకాల చౌకైన ప్లాన్స్‌ తీసుకువస్తోంది.

అపరిమిత డేటా