Tollywood : షూటింగ్ జరుగుతుండగా అడవిలోకి లగెత్తిన ఏనుగు.. చివరకు

ఈ మధ్య జంతువులను సినిమా షూటింగ్స్ లో ఉపయోగించడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో వీఎఫెక్స్ ద్వారా జంతువులను సృష్టిస్తున్నారు. అయితే తాజాగా షూటింగ్ కోసం తీసుకు వచ్చిన ఓ ఏనుగు అదును చూసుకొని అడవిలోకి పరిగెత్తింది.

Tollywood : షూటింగ్ జరుగుతుండగా అడవిలోకి లగెత్తిన ఏనుగు.. చివరకు
Elephant
Follow us

|

Updated on: Oct 05, 2024 | 11:52 AM

సినిమా షూటింగ్ లకోసం  అడవి జంతువులు ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం.. చాలా మంది ఫైట్స్ సీన్స్ లో ఏనుగులను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ మధ్య జంతువులను సినిమా షూటింగ్స్ లో ఉపయోగించడం పై అభ్యంతరాలు వ్యక్తం అవుతుండటంతో వీఎఫెక్స్ ద్వారా జంతువులను సృష్టిస్తున్నారు. అయితే తాజాగా షూటింగ్ కోసం తీసుకు వచ్చిన ఓ ఏనుగు అదును చూసుకొని అడవిలోకి పరిగెత్తింది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఓ సినిమా కోసం ఏనుగులను తెప్పించారు. సినిమాలోని ఓ ఫైట్ సీన్ కోసం ఏనుగును ఉపయోగించాలని దర్శకుడు భావించారు. ఈ మేరకు ఓ ఏనుగును తెప్పించారు.

కొచ్చిలోని అడవి ప్రాంతంలో ఈ ఫైట్ సీన్  చిత్రీకరిస్తున్నారు. ఇందుకోసం పుత్తుపల్లి సాధు అనే ఏనుగును రప్పించారు. షూటింగ్ జరుగుతుండగా అనుకోకుండా ఆ ఏనుగు హల్‌చల్ చేయడం ప్రారంభించింది. మావటి అదుపు చేసిన ఆ ఏనుగు కంట్రోల్ అవ్వలేదు. ఆతర్వాత అది అక్కడి నుంచి అడవిలోకి పరిగెత్తింది. కాగా ఆ ఏనుగును కనిపెట్టేందుకు చాలా కష్టపడ్డారు అధికారులు. ఏనుగు కోసం వెతకడానికి తుండం రేంజ్ అధికారి నేతృత్వంలో 50 మంది అడవిలో గాలించారు.

అటవీ శాఖ అధికారులతో పాటు ఆర్‌ఆర్‌టీ బృందం , స్థానికులు ఏనుగును గాలించారు. ఏనుగు పాదముద్రలను కనుక్కొని దాని ఆధారంగా ఏనుగును వెతికారు. ఎట్టకేలకు ఆ ఏనుగును కనిపెట్టారు.  మొత్తానికి ఏనుగును అడవి నుంచి బయటకు తీసుకొచ్చారు. కేరళకు చెందిన ఈ ఏనుగు  మునుపెన్నడూ ఇలా చేయలేదని చెప్తున్నారు. ప్రస్తుతం ఏనుగు వయసు 52 ఏళ్లు. ఈ ఏనుగు అనేక పండుగలలో భాగం అయ్యింది. అలాగే ఇది అత్యంత వేగవంతమైన ఏనుగు అని అక్కడి వారు చెప్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి