ఏడుస్తూ ఇంటికెళ్లిన రష్మిక.. కారణమిదే
04 October 2024
Basha Shek
అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది రష్మిక మందన్నా. ప్రజెంట్ ఈ బ్యూటీ ‘పుష్ప 2’తో బిజీగా ఉంది.
భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ పాన్ ఇండియా హీరోయిన్‌గా దూసుకుపోతుందీ అందాల తార.
అయితే.. ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కెరీర్ స్టార్టింగ్‌లో రష్మికకు పలు చేదు అనుభవాలు ఎదురయ్యాయట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక తన కెరీర్ ప్రారంభంనాటి విషయాలను గుర్తుకు తెచ్చుకుని ఎమోషనలైంది.
'సినిమా కెరీర్ స్టార్టింగ్‌లో ఆడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ కన్నీళ్లతోనే ఇంటికి వెళ్లేదాన్ని' అని తెలిపింది రష్మిక.
'ఒక సినిమాలో అయితే.. సెలక్ట్ అయిన తర్వాత రెండు, మూడు నెలల పాటు వర్క్‌షాప్స్ జరిగాయి'.
అయితే అనూహ్యంగా ఆ తర్వాత ఆ సినిమా రద్దు అయింది. అలా పాతిక ఆడిషన్స్‌లో రిజెక్ట్ అయ్యాను'.
'నా నటనపై వాళ్లకు నమ్మకం ఉండేది కాదు. అలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా’నంది రష్మిక.
ఇక్కడ క్లిక్ చేయండి..