ప్రతిరోజూ ఒక కప్పు ఆనియన్ టీ తాగడం వల్ల బీపీని కంట్రోల్ చేయవచ్చని మీకు తెలుసా. ఆరోగ్య నిపుణులు సూచిస్తున్న ఈ ఉల్లి టీ తయారీ, ప్రయోజనాలు మీకోసం.
ఉల్లిపాయలో ఫ్లేవనాల్, క్వెర్సెటిన్ అనే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.
అంతేకాకుండా ఆహారంలో భాగంగా ఉల్లిపాయ తీసుకోవడం, దీనితో తయారు చేసిన టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరవు.
ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఆనియన్ టీని ఇంట్లోనే ఏవిధంగా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కావలసిన పదార్దాలు: తరిగిన ఉల్లిపాయ: 1, లవంగాలు, వెల్లుల్లి మొగ్గలు: 2 లేదా 3, తేనె: 1 టేబుల్ స్పూన్, నీళ్లు: 1 లేదా 2 కప్పులు, బే ఆకు లేదా దాల్చిన చెక్క: 1 లేదా 2
ముందుగా స్టవ్‌పై పాన్ ఉంచి అందులో నీళ్లుపోసి మరిగించాలి. తర్వాత మరిగిన నీటిలో తరిగిన ఉల్లిపాయలు, తరిగిన వెల్లుల్లి, లవంగాలు, బే ఆకులను వేసి మరిగించాలి.
నీటి రంగు మారిన తర్వాత.. ఒక కప్పులో ఒడ కట్టాలి. రుచికి సరిపడా తేనె, దాల్చిన చెక్క పొడిని కలుపుకుంటే ఉల్లిపాయ టీ రెడీ!
ఈ టీని రోజూ ఉదయం తాగడం వల్ల మీరు ఎనర్జిటిక్‌గా ఉండటమేకాకుండా బ్లడ్ ప్రెజర్ కూడా కంట్రోల్‌గా ఉంటుంది.