
సంగారెడ్డిలో మనీషా. మహబూబ్‌నగర్‌లో యశోదా. ఆరబెట్టిన పల్లీలను కుక్క ఎంగిలి చేసిందని, ఇక రేబిస్ కన్ఫామ్ అని భయపడిపోయి ఆత్మహత్య చేసుకుంది. ఒంటరిగా చనిపోలేదు. మూడేళ్ల కూతురిని చంపి సూసైడ్ చేసుకుంది. ఇంటిళ్లిపాదికి రేబిస్ వ్యాక్సిన్ వేయించినా సరే.. ఆమె మానసిక స్థితి అంగీకరించలేకపోయింది. ఒక్కోసారి చుట్టుపక్కల వారికి కనిపించకపోవచ్చు గానీ.. ఇలాంటి భయాలతో మన ఇళ్ల మధ్యే ఉండేవాళ్లు చాలా మందే ఉన్నారు. ఒక్కసారి ఆ డేటా తెలుసుకుందాం… హైదరాబాద్ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్‌కి రోజుకు 540 మంది పేషెంట్స్ వస్తుంటారు. అందులో పాతవాళ్లున్నారు, కొత్తవాళ్లూ ఉన్నారు. ఆందోళన కలిగించే మ్యాటర్ ఏంటంటే.. వీరిలో 35 శాతం మంది బాధితులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారే! గ్రేట్‌గా ఫీల్ అవాల్సిన అంశం ఏంటంటే.. ఎవరేమనుకుంటారోనన్న భయం వీడి ముందుకొస్తున్నారు. హ్యాట్సాఫ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఓ సర్వే చేసింది. ఈ భూమ్మీద దాదాపు వంద కోట్ల మందికి పైగా మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారని తేల్చింది. అంటే.. ప్రపంచ జనాభాలో ప్రతి ఐదుగురిలో ఒకరు డిప్రెషన్‌తోనే ఉన్నారు. ప్రతి 100 మరణాల్లో ఒకటి మానసిక సమస్యల కారణంగా జరుగుతున్న ఆత్మహత్యే. ఇండియాలో పరిస్థితి కూడా ఏమంత బాగోలేదు. భారత్‌లో 15 కోట్ల మందికి మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలు అవసరం అని ఓ రిపోర్ట్ తేల్చింది. 15 కోట్ల మందికి మెంటల్ హెల్త్ అవసరం ఉన్నప్పటికీ… కేవలం 2 కోట్ల మంది మాత్రమే డాక్టర్స్ దగ్గరికి...