
ఇంట్లో ఎక్స్‌టెన్షన్ బోర్డు ఉంటే చాలు.. అనేక ఉపకరణాలు వాడేస్తుంటారు చాలా మంది. కానీ వాడేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరిగా అవసరం. ముఖ్యంగా ఇంట్లో టీవీ, ఫ్రిజ్, ల్యాప్‌టాప్, మొబైల్ చార్జర్, మిక్సీ వంటి అనేక ఉపకరణాలు ఒకేసారి వాడేటప్పుడు చాలా మంది ఎక్స్‌టెన్షన్ బోర్డు ఉపయోగిస్తారు. అయితే సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే షార్ట్ సర్క్యూట్, ఫైర్ ప్రమాదం, ఎలక్ట్రిక్ షాక్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫ్రిడ్జ్ ని ఎక్స్‌టెన్షన్ బోర్డుతో వాడితే సర్క్యూట్ ట్రిప్ అవుతుంది. కంప్రెసర్ కూడా పాడవుతుంది. ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు..ఓవర్‌లోడ్ చేయకూడదు.
ఎక్స్‌టెన్షన్ బోర్డులో హీటర్, ఇస్త్రీ లాంటి వేడెక్కే ఉపకరణాలు వాడకూడదు. మైక్రోవేవ్ కి 10-15 ఆంపియర్లు కావాలి. ఎక్స్‌టెన్షన్ బోర్డు కి ఇది ఎక్కువ. వాషింగ్ మెషిన్ ని ఎక్స్‌టెన్షన్ బోర్డుతో వాడవచ్చు. కానీ వాట్స్ చూసి బోర్డు తెలుసుకోవాలి. హీటర్, ఎ.సి. లాంటి పెద్ద ఉపకరణాలకు ఎక్కువ కరెంటు తీసుకుంటాయి. కాబట్టి ఈ బోర్డును వాడకూడదు. కిచెన్ లోని చిన్న ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కూడా బోర్డులో వాడలేం. కొన్నింటికి ఎక్కువ కరెంటు కావాలి. ఒకే బోర్డులో ఎక్కువ పవర్ తీసుకునే పరికరాలు కలిపి వాడితే ఓవర్‌లోడ్ అవుతుంది. నాణ్యతలేని వైర్లు వేడెక్కి కరిగిపోవచ్చు. చిన్నపిల్లలు తాకితే ప్రమాదం. ఇకపోతే, ISI మార్క్ ఉన్న బోర్డు మాత్రమే వాడండి. నాణ్యమైన, సర్టిఫైడ్ ప్రొడక్ట్ అయితేనే సురక్షితం.
ఎక్స్‌టెన్షన్ బోర్డు వైర్లు చిట్లిపోయాయా చూసుకోండి. వైర్ కవరింగ్ దెబ్బతిన్నా వెంటనే మార్చేయాలి. తడి ప్రదేశాల్లో వాడకండి. బాత్రూమ్, సింక్ దగ్గర వంటి తడి ప్రాంతాల్లో వాడటం ప్రమాదకరం. లూజ్ కనెక్షన్ వల్ల స్పార్కింగ్ జరుగుతుంది. ఉపయోగం లేనప్పుడు స్విచ్ ఆఫ్ చేయండి. ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది, ప్రమాదాలు తగ్గుతాయి. మరీ ముఖ్యంగా ఎక్స్‌టెన్షన్ బోర్డును మరో ఎక్స్‌టెన్షన్ బోర్డుకు కలపకండి. సర్జ్ ప్రొటెక్షన్ ఉన్న బోర్డులు ఉపయోగిస్తే ఎలక్ట్రానిక్ పరికరాలు సురక్షితంగా ఉంటాయి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ఇంట్లో ఎలక్ట్రికల్ భద్రత చాలా ముఖ్యం.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..