Viral News: రసగుల్ల ఎంత పని చేసింది.! పెళ్లి వేడుకలో స్వీట్స్‌ సరిపోలేదని..

వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉత్తర ప్రదేశ్‌లోని శంషాబాద్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుక జరిగింది. వివాహానికి వచ్చిన అతిథుల కోసం రసగుల్లాలు ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన అతిథులందరికీ రసగుల్లాలు సరిపోలేవు. తగినన్ని రసగుల్లలు లేకపోయే సరికి వివాహానికి వచ్చిన వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు...

Viral News: రసగుల్ల ఎంత పని చేసింది.! పెళ్లి వేడుకలో స్వీట్స్‌ సరిపోలేదని..
Viral News

Updated on: Nov 21, 2023 | 9:40 AM

కొన్ని సందర్భాల్లో చిన్న సమస్యలే పెద్దగా మారుతుంటాయి. పరిస్థితులు చినికి చినికి గాలి వానగా మారే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నిత్యం న్యూస్ పేపర్స్‌లో, వార్తల్లో ఇలాంటి సందర్భాలు చూస్తూనే ఉంటాం. కొన్ని సందర్భాలు చూస్తుంటే ఇందుకు కూడా గొడవపడుతారా.? అనిపిస్తుంది. తాజాగా ఇలాంటి ఓ వెరైటీ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.

వివరాల్లోకి వెళితే.. ఆదివారం ఉత్తర ప్రదేశ్‌లోని శంషాబాద్‌ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి ఓ వివాహ వేడుక జరిగింది. వివాహానికి వచ్చిన అతిథుల కోసం రసగుల్లాలు ఏర్పాటు చేశారు. అయితే వచ్చిన అతిథులందరికీ రసగుల్లాలు సరిపోలేవు. తగినన్ని రసగుల్లలు లేకపోయే సరికి వివాహానికి వచ్చిన వారి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సమస్యను సద్దుమణిగించారు.

ఈ ఘర్షణలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయని, కేసు నమోదు చేశామని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు ప్రమాదం నుంచి బయటపడ్డారని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అనిల్ శర్మ తెలిపారు.

ఇదిలా ఉంటే గతంలోని ఇలాంటి ఓ సంఘటన చోటు చేసుకుంది. గతేడాది జరిగిన ఓ వివాహ వేడుకలోనూ ఇలాంటి సంఘటనే ఉత్పన్నమైంది. గతేడాది అక్టోబర్‌లో ఎత్మాద్‌పూర్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో స్వీట్లు సరిపోవాలన్న కారణంతో గొడవ జరిగింది. ఈ గొడవలో ఒక వ్యక్తి మరణించడం అప్పట్లో సంచలనంగా మారింది.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us