హిందువులు జరుపుకునే పండుగలలో సంక్రాంతి పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. సంక్రాంతి అంటే కొత్త వెలుగులు అని అర్థం. అంటే సంక్రాంతిని జరుపుకోవడం అంటే కొత్త వెలుగులకు స్వాగతం పలకడం. అయితే తెలంగాణలో జరుపుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ, దసరా.. అలాగే ఆంధ్రప్రదేశ్లో జరుపుకునేది సంక్రాంతి. సంక్రాంతి మొత్తం 33 రోజుల పాటు జరుపుకునే పెద్ద పండుగ. మకరాశిలోకి సూర్యుడు ప్రవేశించే వేళ సంక్రాంతిని జరుపుకుంటారు. అలాగే భగీరథుడు గంగను భూలోకానికి తీసుకువచ్చి.. సగరులకు శాప విమోచనం చేయించింది కూడా ఈ పండుగ రోజే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ పండుగ రోజున పిండి వంటలు, భోగీ మంటలు, రంగుల ముగ్గులు, కోడి పందాలతో అంగవైభవంగా జరుపుకుంటారు. కానీ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వారిగా ఈ పండుగకు రకారకాల పేర్లతో పిలుస్తూంటారు. అయితే ఈ పండుగ రోజు చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి పర్వదినం రోజున ఇంట్లో మాంసం వండకూడదు అంటారు. అలాగే వంట చేసేటప్పుడు అందులో కొన్ని నువ్వులు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. అలాగే ఈ రోజున మన పూర్వీకులను అసలు అశ్రద్ధ చేయకూడదు. అలాగే మన తల్లిదండ్రులతో ఎలాంటి వాదనలు పెట్టుకోకుడదు. ఈ పండుగ రోజు ఆహారం ధానం చేయడం వలన ఎంతో పుణ్యం లభిస్తుందని తెలుపుతున్నారు.
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభవార్త.. ప్రత్యేక రైళ్లు పొడిగింపు.. పూర్తి వివరాలివే..!