Dream: కలలో స్త్రీ నగ్నంగా కనిపిస్తే.. ఏమవుతుందో తెలుసా.?

అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు వచ్చే కలలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అప్రయత్నంగా వచ్చే కలలో ఎంతో అర్థం ఉంటుందని అంటున్నారు. మరి రాత్రి పడుకున్న తర్వాత కలలో ఒకవేళ నగ్నంగా ఉన్న యవతి కనిపిస్తే దేనికి సంకేతం.? జీవితంలో ఏం జరగబోతోందని అర్థం చేసుకోవాలో..

Dream: కలలో స్త్రీ నగ్నంగా కనిపిస్తే.. ఏమవుతుందో తెలుసా.?
Dream

Updated on: Aug 01, 2024 | 12:23 PM

రాత్రి పడుకున్న తర్వాత కలలు రావడం సర్వసాధారణమైన విషయం. మనలో ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుడా మనకు వచ్చే కలలు మన జీవితంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతుంటారు. స్వప్నశాస్త్రంలో కూడా దీనికి సంబంధించి ఎన్నో అంశాలను ప్రస్తావించారు. అలాగే మానసిక నిపుణులు సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రాత్రుళ్లు వచ్చే కలలు మన నిజ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అప్రయత్నంగా వచ్చే కలలో ఎంతో అర్థం ఉంటుందని అంటున్నారు. మరి రాత్రి పడుకున్న తర్వాత కలలో ఒకవేళ నగ్నంగా ఉన్న యవతి కనిపిస్తే దేనికి సంకేతం.? జీవితంలో ఏం జరగబోతోందని అర్థం చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఒకవేళ కలలో మీకు స్త్రీ దుస్తులు లేకుండా కనిపిస్తే మీకు నచ్చిన వ్యక్తితో ఉండాలని కోరుకుంటున్నట్లు అర్థం చేసుకోవాలి. మీకు నచ్చిన వారి భద్రత గురించి ఆందోళన చెందుతున్నారని అర్థం.

* ఇక స్త్రీ తనను తాను నగ్నంగా చూసుకున్నట్లయితే.. తన గురించి ఏదో రహస్యాన్ని దాచిపెడుతోందని అర్థం. ఎవరికీ తెలియని ఏదో రహస్యం తనలో ఉంచుకుంటోందని అర్థం చేసుకోవాలి.

* పురుషులు తనకు నచ్చిన స్త్రీని నగ్నంలో కగలో చూస్తే.. ఆ స్త్రీ పట్ల ఎంతో ఆకర్షితులవుతున్నాడని అర్థం చేసుకోవాలి. మీరు మానసికంగా ఆమెకు ఎంతగానో దగ్గరయ్యారని భావం.

* నగ్నంగా ఉన్న స్త్రీతో మాట్లాడుతున్నట్లు కల వస్తే మీకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయువు ఉంటుందని అర్థం. అలాగే కొంత కాల నుంచి మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం లభించనుందని అర్థం చేసుకోవాలి.

* ఒకవేళ మీకు కలలో అపరచిత వ్యక్తి నగ్నంగా కనిపిస్తున్నట్లు కనిపిస్తే.. మీరు త్వరలోనే ప్రేమలో లేదా వైవాహిక జీవితంలో అడుగుపెట్టబోతున్నారని అర్థం చేసుకోవాలి. పెళ్లి ఘడియలు దగ్గర పడుతున్నాయని అర్థం చేసుకోవాలి.

* అయితే ఎవరైనా స్త్రీ నగ్నంగా ఉన్న సమయంలో దుస్తులతో కవర్‌ చేసుకుంటున్నట్లు కనిపిస్తే.. అది మహిళలపై మీకున్న అభిప్రాయానికి చిహ్నంగా భావించాలి. మీరు మహిళల విషయంలో ఎంతో హుందాగా ఉంటారని అర్థం.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు పండితులు, శాస్త్రాల్లో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us