Beer: బీర్‌ని ఎలా తయారు చేస్తారు.? దాని రుచి ఎలా మారుతుందంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మద్యం ప్రియులు బీర్లను ఇష్టపడి తాగుతుంటారు. బీరు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఇంతకీ అసలు బీరును ఎలా తయారు చేస్తారో తెలుసా.?

Beer: బీర్‌ని ఎలా తయారు చేస్తారు.? దాని రుచి ఎలా మారుతుందంటే..
How To Make Beer

Updated on: Sep 16, 2024 | 10:37 AM

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది మద్యం ప్రియులు బీర్లను ఇష్టపడి తాగుతుంటారు. బీరు ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదనే వాదనలు కూడా వినిపిస్తుంటాయి. ఏది ఏమైనా ఇంతకీ అసలు బీరును ఎలా తయారు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించారా.? ఇంతకీ బీరు తయారీ ప్రక్రియ ఎలా ఉంటుంది.? బీరు రుచి దేనిపై ఆధారపడి ఉంటుంది.? లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..

బీరును ధాన్యాలను పులియబెట్టడం ద్వారా తయారుచేస్తారు. దీనిని శాస్త్రీయంగా “కిణ్వ ప్రక్రియ”గా పిలుస్తారు. ఈ ప్రక్రియలో, ధాన్యాల నుంచి చక్కెరను సేకరిస్తారు. ఇది ఈస్టార్‌ ద్వారా ఆల్కహాల్, కార్బన్ డయాక్సైడ్‌గా మారుతుంది. బీర్ల తయారీ కోసం బార్లీ గింజలను ఉపయోగిస్తారు. మొదట బార్లీ గింజలను నీటిలో నానబెడతారు. దీంతో అవి మొలకెత్తడం ప్రారంభమవుతాయి. ఈ ప్రక్రియను మెల్టింగ్ అంటారు. మొలకెత్తినప్పుడు, వీటిలో ఉండే స్టార్చ్ చక్కెరగా మారడం ప్రారంభమవుతుంది. అనంతరం ఈస్ట్‌ ద్వారా ఇది ఆల్కహాల్‌గా మారుతుంది. ఈ ద్రవీభవన ప్రక్రియ సుమారు 5-7 రోజుల పాటు కొనసాగుతుంది.

అనంతరం కిణ్వ ప్రక్రియ జరుగుతుంది. మొలకెత్తిన బార్లీని మెత్తగా మారుస్తారు. ఈ గ్రౌండ్ మాల్ట్ నీటిలో కలిపి వేడి చేస్తారు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే చక్కెర కరిగిపోతుంది. తర్వాత దీనిని చల్లబరిచి ఈస్ట్‌ను యాడ్ చేస్తారు. కిణ్వ ప్రక్రియ 7 నుంచి 10 రోజుల వరకు చేస్తారు. కిణ్వ ప్రక్రియకు పట్టే సమయం, ఉష్ణోగ్రత బీర్ రుచిని ప్రభావితం చేస్తుంది.

కిణ్వ ప్రక్రియ ముగిసిన తర్వాత బీర్‌ను కొంత కాలం పాటు చల్లబరుస్తారు. ఇలా చేయడం వల్ల బీరు రుచి మంరింత మెరుగవుతుంది. ఈ ప్రక్రియను “లాగింగ్” అంటారు. ఈ ప్రక్రియ కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు ఉంటుంది. కొన్నిసార్లు లాగింగ్ సమయం కూడా బీర్ రకాన్ని బట్టి ఉంటుంది. లాగింగ్ ప్రక్రియ ఎంత ఎక్కువ రోజులు అంటే బీరు రుచి అంత బాగుంటుందని చెబుతారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..