Daytime Moon: పట్టపగలు చందమామ కనిపించడానికి అదే కారణం.. సైన్స్‌ చెప్పే రహస్యాలు!

|

May 30, 2024 | 8:24 PM

రాత్రిపూట ఆకాశంలో చల్లని వెన్నలను వెదజల్లే చంద్రుడిని మనం పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ కొన్నిసార్లు చంద్రుడు రాత్రి వేళలోనే కాదు పగలు కూడా కనిపిస్తుంటుంది. ఇలా పగటిపూట కూడా చంద్రుడు ఎందుకు ప్రకాశ వంతంగా కనిపిస్తాడనే డౌట్‌ మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అలాగే రాత్రి కనిపించినంత ప్రకాశ వంతంగా పగలు ఎందుకు కనిపించదు అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికీ..

Daytime Moon: పట్టపగలు చందమామ కనిపించడానికి అదే కారణం.. సైన్స్‌ చెప్పే రహస్యాలు!
Daytime Moon
Follow us on

రాత్రిపూట ఆకాశంలో చల్లని వెన్నలను వెదజల్లే చంద్రుడిని మనం పుట్టినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. కానీ కొన్నిసార్లు చంద్రుడు రాత్రి వేళలోనే కాదు పగలు కూడా కనిపిస్తుంటుంది. ఇలా పగటిపూట కూడా చంద్రుడు ఎందుకు ప్రకాశ వంతంగా కనిపిస్తాడనే డౌట్‌ మనలో చాలా మందికి వచ్చే ఉంటుంది. అలాగే రాత్రి కనిపించినంత ప్రకాశ వంతంగా పగలు ఎందుకు కనిపించదు అనే సందేహం కూడా ప్రతి ఒక్కరికీ వచ్చే ఉంటుంది? నిజానికి దీని వెనుక పెద్ద విచిత్రం ఏమీ లేదు.

సూర్యుని నుంచి ప్రతిబింబించే కాంతి కారణంగా రాత్రిళ్లు చంద్రుడు ప్రకాశ వంతంగా కనిపిస్తాడనే సంగతి మనందరికీ తెలుసు. అంతేకాకుండ చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటం వల్ల రాత్రి ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపిస్తుంది. సూర్యుని తర్వాత అంతరిక్షంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే మరో గ్రహం చంద్రుడు మాత్రమే. చంద్రుడు పగటిపూట కనిపించడానికి కారణం.. భూమి వాతావరణం, చంద్రుని కక్ష్య చక్రం ఇందుకు ప్రధాన కారణం. నిజానికి భూమిపై వాతావరణం లేకపోతే చంద్రుడు భూమిపై అన్ని సమయాలలో కనిపిస్తాడు. అమావాస్య సమయంలో చంద్రుని చీకటి వైపు భూమి వైపు ఉంటుంది. అందువల్ల భూమిపై ఉన్న వారికి ఆకాశంలో చంద్రుడు కనిపించడు.

పగటిపూట చంద్రుని దర్శనం అందుకే..

భూమిపై వాతావరణంలోని వాయువు కణాలు, ముఖ్యంగా నైట్రోజన్, ఆక్సిజన్.. భూమిపై నీలం, వైలెట్ కాంతి వంటి తక్కువ తరంగదైర్ఘ్య కాంతిని వెదజల్లుతాయి. ఈ వెదజల్లే కాంతిని గ్రహించి వేర్వేరు దిశల్లో వెదజల్లడం వల్ల ఆకాశం నీలం రంగులోకి మారుతుంది. విల్లానోవా యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో ఖగోళ శాస్త్రం, ఖగోళ భౌతిక శాస్త్ర ప్రొఫెసర్ ఎడ్వర్డ్ గినాన్ లైవ్ దీని గురించి మాట్లాడుతూ.. పగటిపూట చంద్రుడు కనిపించాలంటే, సూర్యుడి కాంతిని చంద్రడు అధిగమించాలి. అమావాస్య భూమిపై ఉన్న ప్రజలకు చంద్రుడు కనిపించదు. ఎందుకంటే ఆకాశంలో దాని స్థానంలో సూర్యుని కాంతి చంద్రుడిని అధిగమిస్తుంది. కానీ చంద్రుడు భూమికి దగ్గరగా ఉండటం (సగటున 238,900 మైళ్ళు లేదా 384,400 కిలోమీటర్లు) వల్ల సూర్యుడి నుంచి ప్రతిబింబించే కాంతి ద్వారా చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

భూమిపై నుంచి కనిపించే నక్షత్రాలు సూర్యుడి నుండి వచ్చే కాంతి కంటే మిలియన్ బిలియన్ రెట్లు తక్కువ ప్రకాశవంతంగా ఉంటాయి. చంద్రుడి కంటే మిలియన్ రెట్లు మందంగా ఉంటాయి. సూర్యుని నుంచి వెలువడే కాంతి ఆకాశంలో ప్రకాశవంతంగా ఉంటుంది. అందుకే అది పగటిపూట నక్షత్రాల కాంతిని కప్పివేస్తుంది. కానీ చంద్రుడు ప్రతిబింబించే కాంతిని సూర్య కిరణాలు ఎల్లప్పుడూ అణచివేయలేవు. చంద్రుడు నక్షత్రాల కంటే భూమికి దగ్గరగా ఉన్నందున, దాని ఉపరితల ప్రకాశం ఆకాశ ఉపరితల ప్రకాశం కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే పగటిపూట కూడా చంద్రుడిని సులభంగా మనం చూడగలుగుతున్నాం. అలాగే పగటిపూట చంద్రుని దృశ్యమానత ఇతర విషయాల ద్వారా కూడా ప్రభావితమవుతుంది.

నెలలో చంద్రుడు రోజుకు ఎన్నిసార్లు కనిపిస్తాడు?

ఏడాది పొడవునా నెలలో సగటున 25 రోజులు చంద్రుడు పగటి వెలుగులో కనిపిస్తాడు. మిగిలిన ఐదు రోజులు అమావాస్య, పూర్ణిమలు ఉంటాయి. అమావాస్య దగ్గర, అది సూర్యుడికి చాలా దగ్గరగా ఉంటుంది. కాబట్టి అది కనిపించదు. పౌర్ణమికి దగ్గరగా ఉన్నప్పుడు, అది రాత్రిపూట మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటే సూర్యుడు అస్తమించినప్పుడు చంద్రుడు ఉదయిస్తాడు. సూర్యుడు ఉదయించినప్పుడు అస్తమిస్తాడు. చంద్రుడు రోజుకు 12 గంటలు హోరిజోన్ పైన ఉంటాడు. కానీ దాని ప్రదర్శన ఎల్లప్పుడూ పగటి సమయాలతో సమానంగా ఉండకపోవచ్చు. శీతాకాలంలో పగటి సమయం తక్కువగా ఉంటుంది. అందువల్ల పగటిపూట చంద్రుడు కనిపించడానికి తక్కువ సమయం ఉంటుంది. పగటిపూట చంద్రుడిని చూడటానికి ఉత్తమ సమయం మొదటి త్రైమాసికం (అమావాస్య తర్వాత మొదటి వారం), మూడవ త్రైమాసికం (పౌర్ణమి తర్వాత మొదటి వారం). మొదటి త్రైమాసికంలో మధ్యాహ్నం సమయంలో తూర్పు ఆకాశంలో చంద్రుడు ఉదయిస్తున్నట్లు మనం చూడవచ్చు. మూడవ త్రైమాసికంలో ఇది పశ్చిమ ఆకాశంలో అస్తమిస్తూ ఉదయం వేళలో కనిపిస్తుంది. ఈ దశ సూర్యుడితో పాటు ఆకాశంలో చంద్రుడు ఎక్కువగా కనిపించే రోజుల్లో.. రోజుకు సగటున ఐదు నుండి ఆరు గంటలు ఉంటుంది.

చంద్రుడు కనిపించే సమయాన్ని ప్రభావితం చేసే మరొక దృగ్విషయం భూమిపై వెలుగు. చంద్రుడు పగటిపూట నెలవంక నుండి త్రైమాసిక దశ వరకు ఆకాశంలో ఎక్కువగా కనిపిస్తాడు. కానీ పగటిపూట పౌర్ణమి దశను సూర్యుడు అస్తమించే ముందు మాత్రమే చూడవచ్చు. చంద్రవంక దశలో అది సూర్యునికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల మీరు చంద్రుని చీకటి వైపు కూడా చూడగలుగుతారు. చంద్రుని చీకటి వైపు భూమి నుంచి ప్రతిబింబించే కాంతిని పొందడం వల్లనే ఇది జరుగుతుంది . ఈ దృగ్విషయాన్ని చూడటానికి ఉత్తమ సమయం చంద్రవంక దశ. ఇది అమావాస్య మూడు లేదా నాలుగు రోజుల తర్వాత వస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.