Crocodile Attack on Deer: ఈ సృష్టి లో అమ్మ ప్రేమను మించిన శక్తి వేరెక్కడా లేదు. అందుకనే దేవుడి కూడా అమ్మ ప్రేమ కోసం తపిస్తాడు అని అంటారు.. అవును అమృతం ఆయుష్సు పోస్తుందో లేదో తెలీదుగానీ.. ‘అమ్మ’ మాత్రం..తన ఆయుష్సును సైతం బిడ్డకే అందిస్తుంది. తన బిడ్డ ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటుంది. బిడ్డల ప్రాణాలు కాపాడుకునేందుకు తల్లులు ఎంతకైనా తెగిస్తారు. అమ్మప్రేమ విషయం లో పశుపక్షాదులు కూడా తీసిపోవు ఈ విషయాన్నీ ఇప్పటీకే అనేక సంఘటనలు రుజువు చేశాయి. తాజాగా అమ్మ ప్రేమకు ఏదీ సాటిరాదని మరోసారి రుజువు చేసే తల్లిబిడ్డల హార్ట్ టచింగ్ వీడియో ఒకటి ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. తన బిడ్డను కాపాడుకునేందుకు ఓ తల్లి జింక చేసిన త్యాగాన్ని చూస్తే హృదయం ద్రవిస్తుంది ఎవరికైనా ..
నదిలోని ఓ మొసలి మాటేసి.. జింక పిల్లను వేటాడేందుకు దగ్గరికి వచ్చింది. ఇంతలోనే మరోవైపు నుంచి ఉన్నట్టుండి బిడ్డకు అడ్డుగా తల్లి జింక వచ్చింది..దీంతో ఆ తల్లి జింక మొసలికి ఆహారంగా మారింది. ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత్ నందా ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోను చూసిన వారంతా.. అమ్మ యొక్క గొప్పతనం ఇదేనంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
అమ్మ ఏ రూపంలో ఉన్నా అమ్మనే అని నిరూపించింది ఈ తల్లిజింక. మాటలకు అందనిది అమ్మ ప్రేమ…నడిచే దైవం అమ్మ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. తన ప్రాణాలు సైతం లెక్కచేయకుండా త్యాగాలకు వెనుకాడదనిదే అమ్మతనం. బిడ్డ ప్రాణం కాపాడుకునేందుకు తన ప్రాణాలనే అడ్డుగా వేసిన ఈ జింక త్యాగాన్ని చూస్తుంటే కన్నీళ్లు రాక మానవు.
Also Read: