Unique Name: ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పేరు.. ఈ బాలుడి నేమ్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సందే

unique baby names: పుట్టిన బిడ్డకు పేరు పెట్టడం అనేది ప్రతి ఇంట్లో ఒక పండగ వాతావరణంగా జరుగుతుంది. ఆ బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని, తల్లిదండ్రుల నుంచి దూరపు చూట్టాల దాకా.. అందిరినీ తెగ అడిగేస్తుంటాం. మొత్తానికి ఒక పేరు దొరికినా దానికి రాశి, నక్షత్రం సరిపోవాలి, ఆ పేరుకు మంచి అర్థం ఉండాలి. ఇలా ఎన్నో చూడాల్సి ఉంటాయి. కానీ ఇండోనేషియాకు చెందిన ఒక తండ్రి మాత్రం ఈ లెక్కలన్నింటినీ పక్కన పెట్టి, తన కొడుకుకు ఒక వెరైటీ పేరు పెట్టాడు. ఆ పేరు బహుషా ప్రపంచంలో ఎవరికీ ఉండకపోవచ్చు. ఇంతకు ఆ పేరేంటనేగా మీ డౌట్‌.. అయితే తెలుసుకుందాం పదండి.

Unique Name: ప్రపంచంలోనే అత్యంత విచిత్రమైన పేరు.. ఈ బాలుడి నేమ్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సందే
Viral News

Updated on: Oct 24, 2025 | 11:48 AM

ఇండోనేషియాకు చెందిన ఒక తండ్రి తన కొడుకుకు ప్రపంచంలో ఎవరికీ లేని విధంగా “ABCDEF GHIJK Zuzu” అనే పేరును పెట్టాడు. అవును, మీరు విన్నది 100% నిజమే. అతని పేరును తన తండ్రి ఇంగ్లీష్ అక్షరమాలలోని మొదటి 11 అక్షరాలతో రూపొందించాడు. ఈ వింత పేరుతో ఈ అబ్బాయిని ప్రపంచవ్యాప్తంగా ఏంతో ఫేమస్ అయ్యాడు. అయితే ఈ బాలుడి పేరు ప్రపంచానికి తెలిసిన విధానం జనాలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ బాలుడు టీకా వేసుకునేందుకు ఒక టీకా శిబిరానికి వెళ్లాడు. టీకా వేసే ముందు, వైద్య సిబ్బంది రిజిస్ట్రేషన్ కోసం అతని పేరు అడిగారు. అప్పుడు ఆ బాలుడు తన పేరు “ABCDEF GHIJK Zuzu” అని చెప్పాడు. మొదట, సిబ్బంది అతను తమాషా చేస్తున్నాడని అనుకున్నారు.

నిజం చెప్పు బ్రదర్, అని అతన్ను తిట్టారు. అప్పుడు ఆ బాలుడు తన ఐడి కార్డును చూపించాడు. దానిలో “ABCDEF GHIJK” అని ఉంది. అది చూసిన సిబ్బంది షాక్ అయ్యారు. అయినా నమ్మకుండా అతని స్కూల్ యూనిఫామ్‌ను చెక్‌చేశారు అక్కడ కూడా అదే పేరు ఉండడంతో కన్ఫార్మ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ఈ ‘ఆల్ఫాబెట్ బాయ్’ కథ మొదలైంది. అతని ఐడి కార్డ్, రిజిస్ట్రేషన్ పుస్తకం ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు ఆ పోస్ట్‌ల కింద తమదైన రీతిలో కామెంట్స్‌ చేశారు.

అయితే తన పేరు గురించి ఆ అబ్బాయిని అడినప్పుడు మొదట్లో, నా క్లాస్ మేట్స్ నన్ను చాలా ఆటపట్టించేవారని.. కానీ ఇప్పుడు ఇది ప్రత్యేకంగా ఉందన్నారు. మొత్తం మీద ఈ వింత పేరుతో ఈ ఆల్ఫాబెట్ బాయ్ ప్రపంచ వ్యాప్తంగా బలే ఫేమస్ అయ్యాడు.

వీడియో చూడండి..

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.