సాధరణంగా పెళ్లికొడుకును పెళ్లి మండపానికి తీసుకురావడానికి అతడిని గుర్రంపై ఊరెగింపుగా తీసుకువస్తుంటారు. దక్షిణ భారత దేశంలో వరుడిని ఇలా గుర్రంపై తీసుకురావడం చాలా అరుదు. కానీ నార్త్ సైడ్ వరుడిని ఇప్పటికీ గుర్రంపైనే తీసుకువస్తుంటారు. తాజాగా గుర్రంపై వరుడు కాకుండా.. వధువు ఊరేగింపుగా పెళ్లి మండపానికి వెళ్ళి అందరికి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే అమ్మాయి వినుత్నంగా ఆలోచించింది. తన పెళ్లి మండపానికి వరుడిలాగా గుర్రం పై ఊరెగింపుగా వెళ్లాలని నిర్ణయించుకుంది. వలేచా తన కుటుంబంలో ఏకైక కూతురు. దీంతో తమ కూతురి కోరికను ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషంగా నెరవేర్చారు. దీపా వలేచా తన పెళ్లి రోజున కుటుంబసమేతంగా కోటాలోని వరుడి ఇంటి వరకు గుర్రంపై స్వారీ చేస్తూ వెల్ళింది. ఈ ఘటన చూసిన వారందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక కొడుకుకు మరియు కూతురుకు తేడా ఏమి లేదని.. కొడుకుల మాదిరిగానే కూతుర్లకు కూడా ఈ సమాజంలో సమాన హక్కులు ఉంటాని దీపా వలేచా తల్లిదండ్రులు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వధువు చేసిన ఈ పనికి నెటిజన్లు ఫిదా అయ్యారు. కూతురు, కొడుకు అనే తేడా చూసే వారికి వలేచా ఒక మంచి సందేశం ఇచ్చిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read:
Valentine Week: భావాలను వ్యక్తం చేసి బంధాలను కలుపుకునే మధురమైన రోజు..