Job Offer: గుర్రం వెంట్రుకలు అల్లడం వచ్చా? రోజుకు రూ. లక్ష పైనే జీతం.. మీరూ ట్రై చేయొచ్చు..!

|

Jun 16, 2023 | 7:34 PM

కూటికోటి కోటి విద్యలు అంటారు పెద్దలు. పాచి పని చేసినా.. కార్యాలయాల్లో ఏసీ కింద కూర్చుని చేసినా జానెడు పొట్టను మూడుపూటలా నింపుకోవడానికే అనేది అందరికీ తెలిసిందే. అయితే, ఈ దునియాలో చేయడానికి పనులకు కొదవే లేదు. రకరకాల పనులు ఉంటాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా చెమటను చిందించే కష్ట జీవులు ఉంటారు..

Job Offer: గుర్రం వెంట్రుకలు అల్లడం వచ్చా? రోజుకు రూ. లక్ష పైనే జీతం.. మీరూ ట్రై చేయొచ్చు..!
Horse
Follow us on

కూటికోటి కోటి విద్యలు అంటారు పెద్దలు. పాచి పని చేసినా.. కార్యాలయాల్లో ఏసీ కింద కూర్చుని చేసినా జానెడు పొట్టను మూడుపూటలా నింపుకోవడానికే అనేది అందరికీ తెలిసిందే. అయితే, ఈ దునియాలో చేయడానికి పనులకు కొదవే లేదు. రకరకాల పనులు ఉంటాయి. మండుటెండను సైతం లెక్క చేయకుండా చెమటను చిందించే కష్ట జీవులు ఉంటారు.. ఏసీ గదిలో దర్జాగా కూర్చుని రెండు చేతులా సంపాదించే వేతన జీవులూ ఉంటారు. అయితే, కొన్ని విచిత్రమైన ఉద్యోగాలు కూడా ఉంటాయి. ఇందుకోసం ఇచ్చే జీతాలు కూడా బహువిచిత్రంగా ఉంటాయి. తాజాగా అలాంటి ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన ఒకటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

గుర్రపు శాలల గురించి మీకు తెలిసే ఉంటుంది. అనాది కాలం నుంచి గుర్రాలకు మాంచి డిమాండ్ ఉంటుంది. రేసింగ్‌లో గుర్రాలను బాగా వినియోగిస్తారు. ఇక గుర్రపు స్వారీ కోసం ధనవంతులు విపరీతమైన ఆసక్తి చూపుతారు. అందుకే చాలామంది గుర్రాలను సాదుతారు. అయితే, వాటిని సాదడం అనేది పెద్ద టాస్క్ అనే చెప్పాలి. ఇక గుర్రాలను అందంగా ఉంచేందుకు విపరీతంగా ఖర్చు చేస్తారు గుర్రపు శాలల యజమానులు. తాజాగా ఇందుకు సంబంధించి ఓ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మీకు గుర్రపు వెంట్రుకలను అల్లడం వచ్చా? వస్తే రోజుకు రూ. 1.22 లక్షలు సంపాదించే అవకాశం ఉంది. అవును, గుర్రాలను అందంగా అలంకరించడమే ఇక్కడ ఉద్యోగం. ప్రదర్శన కోసం గుర్రాన్ని సిద్ధం చేసినప్పుడల్లా.. వాటి వెంట్రుకలతో జడలు అల్లాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ప్రతి గంటకకు రూ. 12 వేలు చెల్లిస్తారు. ఈ పనిలో అనుభవజ్ఞులైతే.. ఒక రోజులు 10 గుర్రాలకు అల్లవచ్చు. అంటే.. ఒక రోజుకు రూ. 1.22 లక్షలు సంపాదించవచ్చు. ఈ ఉద్యోగ అవకాశాలు అరేబియా దేశాలలో ఎక్కువగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

సౌదీ అరేబియా, దుబాయ్, కువైట్, ఖతార్, ఇరాన్ దేశాలలో పెరిగే గుర్రాలకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంటుంది. గుర్రాలను అందంగా ముస్తాబు చేసి ప్రదర్శనకు పెడతారు. ప్రపంచ వ్యాప్తంగా గుర్రాలను ఇష్టపడేవారు వచ్చి వీటిని కొనుగోలు చేస్తారు. అందుకే.. వీటికోసం ప్రత్యేకంగా సంతలు ఏర్పాటు చేస్తారు. ఈ సందర్భంగా గుర్రాలను అందంగా, ఆకర్షణీయంగా ముస్తాపు చేస్తారు. ఇలా ముస్తాబు చేసేందుకు ప్రత్యేకంగా ఉద్యోగులను కూడా నియమించారు గుర్రపు శాలల యజమానులు.

మరిన్ని హ్యూమన్ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..