ఈ ఔషధ సాగుతో లాభాలు అధికం..! అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. ఎకరాకు రూ.1.25లక్షల లాభం

మొదట రెండుసార్లు నీరు పెట్టి వదిలేస్తారు.. దాదాపు 25-30 రోజుల తర్వాత మళ్ళీ నీరు పెడతారు. ఆపై నెలన్నర తర్వాత మళ్ళీ నీరు పెట్టాల్సి ఉంటుందట. ఇంతకు మించిన ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏవీ లేవని చెబుతున్నారు. ఈ పంటకు ఎక్కువ ఎరువులు, పురుగుమందులు కూడా అవసరం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. జంతువులు కూడా దీనికి హాని చేయవు. పంట ఐదు నెలల్లో చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు.

ఈ ఔషధ సాగుతో లాభాలు అధికం..! అతి తక్కువ వర్షంతో పండే ఎడారి పంట.. ఎకరాకు రూ.1.25లక్షల లాభం
Ashwagandha

Updated on: Sep 30, 2025 | 9:55 AM

ప్రస్తుతం రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రకృతి విపత్తులు, అకాల వర్షాలు, చీడపీడల బారినుండి పంటను రక్షించుకోటం వారికి పెద్ద సవాలుగా మారుతోంది. ఇక అన్నీ దాటుకుని తీర పంట చేతికి అందిన తరువాత మార్కెట్‌లో దళారుల చేతిలో మళ్లీ మోసపోవటం రైతు వంతే అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు సాంప్రదాయ పంటల నుండి దూరంగా ఉండి, మరింత లాభదాయకమైన ఔషధ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. అవును మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు చాలా మంది రైతులు అశ్వగంధ సాగుతో లాభాలు గడిస్తు్న్నారు. గత సంవత్సరం జిల్లాలో సుమారు 200 ఎకరాల్లో అశ్వగంధను నాటారు. దీని ద్వారా రైతులు క్వింటాలుకు 50,000 రూపాయల వరకు అధిక లాభాలను ఆర్జించారు. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్‌లో 500 ఎకరాలకు పైగా సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇకపోతే, ఈ అశ్వగంధ అక్టోబర్‌లో విత్తుతారు. కాబట్టి, రైతులు ఇప్పటికే తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. విత్తే ముందు పొలాన్ని లోతుగా దున్నడం, చదును చేయడం చాలా అవసరమని అశ్వగంధ సాగు చేస్తున్న రైతులు చెబుతున్నారు. తరువాత, నేల వదులుగా మారడానికి కొన్ని రోజులు పొలాన్ని బీడుగా వదిలేస్తారట. తర్వాత సీడ్ డ్రిల్ ద్వారా ఎకరానికి 7 కిలోల విత్తనాలను నాటుతారు. మొదట రెండుసార్లు నీరు పెట్టి వదిలేస్తారు.. దాదాపు 25-30 రోజుల తర్వాత మళ్ళీ నీరు పెడతారు. ఆపై నెలన్నర తర్వాత మళ్ళీ నీరు పెట్టాల్సి ఉంటుందట. ఇంతకు మించిన ప్రత్యేక జాగ్రత్తలంటూ ఏవీ లేవని చెబుతున్నారు. ఈ పంటకు ఎక్కువ ఎరువులు, పురుగుమందులు కూడా అవసరం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. జంతువులు కూడా దీనికి హాని చేయవు. పంట ఐదు నెలల్లో చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు.

అశ్వగంధ పంట కోసం ఎకరానికి దాదాపు 20 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని రైతులు చెబుతున్నారు. ఇందులో విత్తనం, గడ్డి, వేరు ఈ మూడింటినీ అమ్ముతారు. గడ్డిని కిలోకు 8 రూపాయలకు, విత్తనాన్ని క్వింటాలుకు 5 వేల రూపాయలకు అమ్ముతారు. ఒక ఎకరం నుండి దాదాపు 3 క్వింటాళ్ల విత్తనాలు ఉత్పత్తి చేయబడతాయి. ఇది ఖర్చును భరిస్తుంది. అయితే దాని వేరు అత్యంత విలువైనది. వేరు ఉత్పత్తి ఎకరానికి 3 నుండి 6 క్వింటాళ్లు, దాని ధర క్వింటాలుకు 30 వేల నుండి 50 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇక ఖర్చుకు 10 రెట్లు లాభం ఉంటుందని చెబుతున్నారు. అంటే, ఒక ఎకరం అశ్వగంధ సాగు నుండి ఒక రైతు రూ. 1.25 లక్షల వరకు లాభం పొందవచ్చు అంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..