Viral: పనికిరాదని 40 ఏళ్లుగా మూలన పడేశారు.. కట్‌ చేస్తే.. అసలు విలువ తెలిసి నోరెళ్లబెట్టారు..

|

May 20, 2022 | 9:10 AM

ఆ వస్తువులో వజ్రాలు లేవు. అలా అని బంగారం లేదా వెండితో అస్సలు తయారు చేయలేదు. అయినా ఎందుకంత విలువ అని ఆలోచిస్తున్నారా..

Viral: పనికిరాదని 40 ఏళ్లుగా మూలన పడేశారు.. కట్‌ చేస్తే.. అసలు విలువ తెలిసి నోరెళ్లబెట్టారు..
Viral Jar
Follow us on

నాలుగు దశాబ్దాలుగా ఒక బ్రిటీష్ కుటుంబం తమ ఇంట్లో అమూల్యమైన వస్తువు ఉన్నా గుర్తించలేదు. చాలా సంవత్సరాలు దాని విలువ గురించి వారికి తెలియకపోవడంతో పక్కన పడేశారు. ఎంతో విలువైన ఆ వస్తువును కేవలం వంటగదిలో మూలన పడేసి, పనికిరానిదిగా ట్రీట్ చేశారు. చివరకు దాని అసలు వాల్యూ తెలిసి నోరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట్లో తెగ సందడిచేస్తోంది. అసలు ఏంటా ఆ వస్తువు, దాని స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం.. ఆ వస్తువులో వజ్రాలు లేవు. అలా అని బంగారం లేదా వెండితో అస్సలు తయారు చేయలేదు. అయినా ఎందుకంత విలువ అంటే.. అది 18వ శతాబ్దానికి చెందిన అరుదైన జాడీ. ఇది పింగాణీతో చేసిన చైనీస్ జాడీ. తాజాగా బ్రిటన్‌లో జరిగిన వేలంలో ఈ జాడీని £1,449,000 పౌండ్స్ అంటే రూ. 13 కోట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఈ అరుదైన జాడీ నెట్టింట్లో సందడి చేస్తోంది.

Also Read: Nikhat Zareen: నీ విజయంతో భారత్ గర్విస్తోంది.. నిఖత్ జరీన్‌ను అభినందించిన ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్

2 అడుగుల పొడవైన జాడీ..

రెండు అడుగుల పొడవైన జాడీ బల్బ్ ఆకారంలో ఉంది. ఇది ఆకుపచ్చ, నీలం, పసుపు, ఊదా రంగులతో పెయింట్ చేశారు. చైనీస్ చక్రవర్తి కియాన్‌లాంగ్ ఆరు-అక్షరాల ముద్ర గుర్తు దీనిపై కనిపిస్తుంది. Qianlong చక్రవర్తి సెప్టెంబర్ 1711 నుంచి ఫిబ్రవరి 7, 1799 వరకు చైనాను పాలించాడు. అతను మంచు నేతృత్వంలోని క్వింగ్ రాజవంశానికి ఆరవ చక్రవర్తి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జాడీ బహుశా 18వ శతాబ్దం మధ్యకాలం నాటిది అని తేలింది. దీనిని కింగ్స్ ప్యాలెస్ హాలులో ఉంచారు.

ఇవి కూడా చదవండి

40 సంవత్సరాల క్రితం 100 పౌండ్లకు కొనుగోలు..

సర్జన్ తండ్రి, ఈ జాడీ యజమాని. 1980లలో దీనిని ఇంటికి తీసుకువచ్చాడు. ఎందుకంటే ఇది చాలా ఆకర్షణీయంగా ఉండడంతో, నచ్చి తనవద్ద ఉంచుకున్నాడు. ఆ సమయంలో అతను దానిని అలంకరణ వస్తువు అనుకొని 100 పౌండ్లకు కొనుగోలు చేశాడు. కొన్నాళ్లపాటు తన వద్దే ఉంచుకుని, కొడుకుకు అప్పగించాడు. అప్పుడు కూడా దాని అసలు విలువ గురించి ఆ కుటుంబానికి తెలియలేదు. తరువాత, ఒక నిపుణుడి కోరిక మేరకు సర్జన్ కుమారాడు దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నాడు. దానిని వేలం వేయాలని నిర్ణయించుకున్నాడు.

ఆన్‌లైన్ వేలం సమయంలో, వాసే £100,000 నుంచి £150,000 మధ్య అమ్ముడవుతుందని అంచనా వేశాడు. ఈ వేలంలో చైనా, హాంకాంగ్‌, అమెరికా, బ్రిటన్‌లకు చెందిన పలువురు పాల్గొన్నారు. చివరికి, ఒక సంపన్న చైనా పౌరుడు తన కోల్పోయిన వారసత్వాన్ని తిరిగి పొందాలనే లక్ష్యంతో దానిని కొనుగోలు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ జాడీ £1.5 మిలియన్లకు(దాదాపు రూ. 13 కోట్లు) విక్రయించారు. అయితే, ఇప్పటి వరకు వారి వద్ద ఎలాంటి రసీదు లేకపోవడం విశేషం.

40 ఏళ్లుగా వంటగదిలో మూలన పడి ఉంది..

Druvettes వద్ద ఆసియా సిరామిక్ ఆర్ట్‌లో నిపుణుడు మార్క్ న్యూస్టెడ్, 1990లలో సర్జన్ కుమారుడు వాన్ ఇంటికి భోజనం చేయడానికి వచ్చాడు. వంటగదిలో ఒక జాడీని చూసి ఆశ్చర్యపోయాడు. చాలా శ్రద్ధగా గమనిస్తే కానీ, అసలు విషయం తెలియలేదు. అప్పటి వరకు 40 ఏళ్లుగా ఈ జాడీ వంట గదిలో ఓ మూలన పడి దుమ్ము, చెత్తతో నిండిపోయింది.

Also Read: Watch Video: అంపైర్‌ నిర్ణయం నచ్చక పీక్స్‌కు చేరిన ఫ్రస్ట్రేషన్‌.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో విధ్వంసం.. వీడియో

Viral Video: గొర్రెపిల్లకు చుక్కలు చూపించిన పిల్లి పిల్ల.. వీడియో చూస్తే నవ్వుఆపుకోలేరు