వాయు తుఫాన్ యూ టర్న్… అప్రమత్తమైన గుజరాత్

Monsoon 2019, వాయు తుఫాన్ యూ టర్న్… అప్రమత్తమైన గుజరాత్

వాయు తుఫాన్ యూటర్న్ తీసుకుంటోంది. ఒమన్ నుంచి గుజరాత్ తీరం వైపు వెనక్కి వస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని కచ్ తీరాన్ని ఈ నెల 17వ తేదీన వాయు తుఫాన్ తాకే అవకాశముందని హెచ్చిరికలు జారీ చేశారు. అయితే గతంతో పోలిస్తే తుఫాన్ బలహీనపడిందని చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాయు తుఫాన్ ప్రభావంతో పోర్ బందర్, ద్వారకా, సోమ్ నాథ్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పోర్ బందర్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి.

గుజరాత్ లోని కచ్ తీరం దాటనుందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురవడంతో పాటు.. బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని చెప్పింది. అయితే గురువారమే ఈ తుఫాన్ గుజరాత్ తీరం దాటాల్సి ఉంది. అనూహ్య రీతిలో తుఫాన్ దిశ మార్చుకోవడంతో పాటు.. ఒమన్ వైపు వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ క్రమంలో మళ్లీ తుఫాన్ గుజరాత్ వైపు దూసుకోస్తుండగా కలవరపాటుకు గురిచేస్తోంది.

ఒమన్ వైపు వెళ్లే ముందు తుఫాన్ వల్ల ఈదురుగాలులు ధాటికి గుజరాత్‌లో వందలాది చెట్లు, విద్యుత్ స్థంభాలు నేలకొరిగాయి. సోమనాథ్ దేవాలయం ప్రవేశ ద్వారం కూడా కుప్పకూలింది. ఇక కేంద్రం తాజా హెచ్చరికలతో గుజరాత్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. తీర ప్రాంతాల్లో అలర్ట్ కొనసాగుతుందని ప్రకటించింది. సహాయక చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షించాలని గుజరాత్ సీఎం విజయ్ రూపానీకి కేంద్ర ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్లు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *