సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ద‌త్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ఆయ‌న ర‌ద్దు చేసుకున్నారు.

సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ
Follow us

|

Updated on: Sep 24, 2020 | 2:38 PM

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్ బండారు ద‌త్తాత్రేయ సెల్ఫ్ ఐసోలేష‌న్‌లోకి వెళ్లిపోయారు. రాజ్‌భ‌వ‌న్‌లో ఏడీసీ అధికారికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తేల‌డంతో ద‌త్తాత్రేయ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. అన్ని అపాయింట్‌మెంట్ల‌ను ఆయ‌న ర‌ద్దు చేసుకున్నారు.

గ‌వ‌ర్న‌ర్ కార్య‌ద‌ర్శి రాకేశ్ క‌న్వ‌ర్‌తో పాటు ఏడీసీ సిబ్బంది మొత్తాన్ని క్వారెంటైన్‌లోనే ఉన్నారు. ఆరోగ్య‌శాఖ సిబ్బంది వారంద‌రికీ కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు. ఇటీవ‌ల ఆ రాష్ట్రానికి చెందిన విద్యుత్ శాఖ మంత్రి సుక్రామ్ చౌద‌రీ, జ‌ల‌శ‌క్తి మంత్రి మ‌హేంద‌ర్ సింగ్ థాకూర్‌లు పాజిటివ్‌గా తేలింది. అయితే ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం కోలుకున్నారు.

సురేంద‌ర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే రాకేశ్ జామ్వాల్‌, నాచ‌న్ ఎమ్మెల్యే వినోద్ కుమార్‌లు కూడా  కోవిడ్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌ అని నిర్దారణ అయ్యింది. ఆ ఇద్ద‌రూ ప్ర‌స్తుతం మండి జిల్లాలోని కోవిడ్ కేర్ సెంట‌ర్‌లో చికిత్స పొందుతున్నారు. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 12,899కి చేరుకున్న‌ది. దేశంలో తక్కువ కేసులు నమోదవుతున్నది కూడా ఇక్కడే.