పర్యాటకులకు చుక్కలు చూపించిన గజరాజులు

ఉత్తరాఖండ్‌లో ఓ ఏనుగుల గుంపు.. అక్కడి అందాలను చూద్దామని వచ్చిన పర్యాటకులకు  చుక్కలు చూపించింది. ఎన్‌హెచ్ 121 రహదారిపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దూసుకొచ్చింది. దీంతో రెండు టూరిస్టుల కార్లు వాటి మధ్యలో చిక్కుకున్నాయి. ఏనుగుల రాకతో ఒక్కసారిగా పర్యాటకుల గుండెల్లో గుబులు నెలకొంది. ఎక్కడ తమపైకి వస్తాయోనంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే అవి ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు అటుగా వచ్చాయి. దీంతో ముందు ఒక్క కారు.. మధ్యలో మరో కారు చిక్కుకుపోయాయి. దానిలో ఉన్న పర్యాటకులు […]

పర్యాటకులకు చుక్కలు చూపించిన గజరాజులు
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 8:15 PM

ఉత్తరాఖండ్‌లో ఓ ఏనుగుల గుంపు.. అక్కడి అందాలను చూద్దామని వచ్చిన పర్యాటకులకు  చుక్కలు చూపించింది. ఎన్‌హెచ్ 121 రహదారిపై ఒక్కసారిగా ఏనుగుల గుంపు దూసుకొచ్చింది. దీంతో రెండు టూరిస్టుల కార్లు వాటి మధ్యలో చిక్కుకున్నాయి. ఏనుగుల రాకతో ఒక్కసారిగా పర్యాటకుల గుండెల్లో గుబులు నెలకొంది. ఎక్కడ తమపైకి వస్తాయోనంటూ బిక్కుబిక్కుమంటూ గడిపారు. అయితే అవి ఒక్కసారిగా రోడ్డు దాటేందుకు అటుగా వచ్చాయి. దీంతో ముందు ఒక్క కారు.. మధ్యలో మరో కారు చిక్కుకుపోయాయి. దానిలో ఉన్న పర్యాటకులు అలాగే ఉండిపోయారు. అయితే ఓ ఏనుగు రెండు కార్లపై స్వల్ప దాడికి పాల్పడింది. ఇక మిగతా ఏనుగుల గుంపు సైలంట్‌గా లోయలోకి వెళ్లిపోయాయి. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రామ్‌నగర్‌లోని మెహన్ ప్రాంతంలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.