తడిసిముద్దయిన తిరుమల క్షేత్రం

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ క్రమంలో  తిరుమలలో జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానతో వెంకన్న సన్నిధి తడిసిముద్దయ్యింది. తిరుమాడ వీధులు జలమయంగా మారాయి. జోరుగా వర్షం పడడంతో తిరుమల రహదారులన్నీ జలమయం అయ్యాయి. కరోనా కారణంగా టీటీడీ శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యంలో భక్తులను అనుమితిస్తుండగా..భారీ వర్షంతో భక్తుల సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తోంది. బీహార్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా విదర్భ తూర్పు […]

  • Sanjay Kasula
  • Publish Date - 10:47 pm, Thu, 2 July 20

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఏపీలోనూ రాయలసీమ ప్రాంతంలో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ క్రమంలో  తిరుమలలో జోరుగా వర్షం కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వానతో వెంకన్న సన్నిధి తడిసిముద్దయ్యింది. తిరుమాడ వీధులు జలమయంగా మారాయి. జోరుగా వర్షం పడడంతో తిరుమల రహదారులన్నీ జలమయం అయ్యాయి. కరోనా కారణంగా టీటీడీ శ్రీవారి దర్శనానికి పరిమిత సంఖ్యంలో భక్తులను అనుమితిస్తుండగా..భారీ వర్షంతో భక్తుల సంఖ్య కూడా తక్కువగానే కనిపిస్తోంది. బీహార్ నుంచి చత్తీస్‌గఢ్ మీదుగా విదర్భ తూర్పు ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.