తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం..

తెలంగాణలో రికార్డు స్థాయిలో 8 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిర్మల్ రూరల్‌లో 8.7 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది

తెలంగాణలో రికార్డు స్థాయిలో వర్షపాతం..
Follow us

|

Updated on: Aug 16, 2020 | 7:57 PM

Heavy Rain In Telangana: ఓవైపు కరోనా కష్టాలు.. మరోవైపు అతి భారీ వర్షాలు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితి. రుతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం కార‌ణంగా ఉభ‌య తెలుగు రాష్ట్రాలలో గ‌త మూడు రోజులుగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని రోజులు వ‌ర్షాల తీవ్రత కొన‌సాగే అవకాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉంటే తెలంగాణలో రికార్డు స్థాయిలో 8 సెంటీమీటర్లు పైగా వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిర్మల్ రూరల్‌లో 8.7 సెంటీమీటర్లు వర్షపాతం కురిసింది. అలాగే కొమురం భీం, సంగారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, నిజామాబాద్ ,భద్రాద్రి కొత్తగూడెం ,ములుగు జిల్లాల్లో 5 నుంచి 6 సెంటీమీటర్ల.. సిద్దిపేట జిల్లాలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Also Read:

‘రనౌట్’తో కెరీర్ ప్రారంభం.. అదే రిటైర్మెంట్‌కు కారణం..!

అంతర్జాతీయ క్రికెట్‌కు సురేష్ రైనా గుడ్ బై..

అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్‌ ప్రకటించిన ధోని..

వరుసగా నాలుగు వికెట్లు.. చరిత్ర సృష్టించిన మహిళా క్రికెటర్..

భారత యువత టార్గెట్‌గా చైనా కుట్ర.. చేధించిన హైదరాబాద్ పోలీసులు..

గ్యాస్ బుక్ చేసుకుంటున్నారా.! అయితే మీకో అదిరిపోయే ఆఫర్..