సింహమా ? నాకేం భయం ? ‘ ఆమె ‘ కు ఇదేం ‘ రోగం ‘ ?

న్యూయార్క్ లోని ఓ పాపులర్ జూ అది ! ముఖ్యంగా ఆఫ్రికన్ సింహాలను ఆ ఎంక్లోజర్ లోకి తరలిస్తుంటారు. దాని చుట్టూ ఎత్తయిన కంచె లాంటి సేఫ్టీ బ్యారియర్ కూడా ఉంది. కానీ.. ఎలా ఎక్కిందో.. ఓ మహిళ ఆ బ్యారియర్ ఎక్కి ఆ ఎంక్లోజర్ లోకి ప్రవేశించింది. ఆమె అలా కిందకు దిగిందో లేదో.. ఓ సింహం చూసి.. మెల్లగా ముందుకు కదిలి ఓ చోట ఆగింది. దానికీ..ఆమెకూ మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం […]

సింహమా ? నాకేం భయం ? ' ఆమె ' కు ఇదేం ' రోగం ' ?
Follow us

|

Updated on: Oct 08, 2019 | 12:01 PM

న్యూయార్క్ లోని ఓ పాపులర్ జూ అది ! ముఖ్యంగా ఆఫ్రికన్ సింహాలను ఆ ఎంక్లోజర్ లోకి తరలిస్తుంటారు. దాని చుట్టూ ఎత్తయిన కంచె లాంటి సేఫ్టీ బ్యారియర్ కూడా ఉంది. కానీ.. ఎలా ఎక్కిందో.. ఓ మహిళ ఆ బ్యారియర్ ఎక్కి ఆ ఎంక్లోజర్ లోకి ప్రవేశించింది. ఆమె అలా కిందకు దిగిందో లేదో.. ఓ సింహం చూసి.. మెల్లగా ముందుకు కదిలి ఓ చోట ఆగింది. దానికీ..ఆమెకూ మధ్య కేవలం కొన్ని అడుగుల దూరం మాత్రమే ఉంది. కానీ.. ఆ మహిళ ఏమాత్రం భయపడకుండా తాను ఉన్నచోటే నిలబడి.. చిన్న పాటి డ్యాన్స్ చేస్తూ.. చేతులూపుతూ కవ్విస్తున్నట్టు.. దాన్ని ఆట పట్టించింది. అది రెచ్చిపోయి.. .తనమీదికి దూసుకువస్తుందన్న స్పృహ కూడా లేదామెకు. సింహానికి, ఈమెకూ మధ్య జరుగుతున్న ఈ వింత తతంగాన్ని చూస్తున్న వాళ్లకు నోట మాట రాలేదు. ఆ మహిళది దుస్సాహసమే అనాలో, లేక మరేమిటో ఏమీ తెలియక అంతా జుట్టు పీక్కున్నంత పని చేశారు. అదృష్టవశాత్తూ ఆ మృగరాజు ఆ మహిళకు ఎలాంటి హానీ చేయకుండా ‘ బొమ్మ ‘ లా నిలబడిపోవడమే విశేషం.ఈ సీన్ అంతా వీడియోకెక్కింది. అయితే ఆమె చేసిన పనిని మాత్రం జూ అధికారులు తీవ్రమైనదిగా పరిగణించారు. నిబంధనల ప్రకారం ఆమెపై చర్యలు తీసుకునేందుకు ఉపక్రమించారు.