సైలెంట్ కిల్లర్ కరోనా.. జాగ్రత్త సుమా !

కనబడని కరోనా భూతం ‘చేస్తున్న మాయలు’ అన్నీ ఇన్ని కావు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో కొందరు చలాకీగా, ఆరోగ్యంగా ఉంటున్నారని వెల్లడైంది. అసలు వారికి ఇది సోకినట్టు తెలియనే తెలియదట. తమకు తెలియకుండానే.. ఇతరులకు దీన్ని సోకింపజేస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. వారి వల్లే ఈ వైరస్ వ్యాపిస్తోందని, వారిలో ఈ లక్షణాలేవీ ఏ మాత్రం కనబడవని ఈ సంస్థ తెలిపింది. అనారోగ్యంగా ఉన్నామని వారికి ఏమాత్రం అనిపించదు.. ప్రతి ఆరుగురిలో ఒకరికి మాత్రమే […]

సైలెంట్ కిల్లర్ కరోనా.. జాగ్రత్త సుమా !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 01, 2020 | 7:17 PM

కనబడని కరోనా భూతం ‘చేస్తున్న మాయలు’ అన్నీ ఇన్ని కావు. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో కొందరు చలాకీగా, ఆరోగ్యంగా ఉంటున్నారని వెల్లడైంది. అసలు వారికి ఇది సోకినట్టు తెలియనే తెలియదట. తమకు తెలియకుండానే.. ఇతరులకు దీన్ని సోకింపజేస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటోంది. వారి వల్లే ఈ వైరస్ వ్యాపిస్తోందని, వారిలో ఈ లక్షణాలేవీ ఏ మాత్రం కనబడవని ఈ సంస్థ తెలిపింది. అనారోగ్యంగా ఉన్నామని వారికి ఏమాత్రం అనిపించదు.. ప్రతి ఆరుగురిలో ఒకరికి మాత్రమే ఇది సీరియస్ అవుతుంది.. ఇది మా అధ్యయనంలో తెలిసింది అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు ఉదాహరణగా దక్షిణ కొరియాలో 31 ఏళ్ళ ఓ మహిళ ఉదంతాన్ని ఈ వర్గాలు గుర్తు చేశాయి. ఆమెకు ఎన్నో రోజులపాటు ఏ విధమైన అనారోగ్య లక్షణాలూ కనిపించలేదని, ఓ చిన్న యాక్సిడెంట్ జరగగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చెకప్ చేయించుకున్నప్పుడు టెస్టులో ఈ వైరస్ ఆనవాళ్లు కనబడ్డాయని ఈ వర్గాలు వెల్లడించాయి. అయితే అప్పటికే ఆమె ఎంతోమందిని కలిసింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంది.. ఫలితంగా ఆ దేశంలో 60 శాతం కరోనా కేసులకు ఆమె మూల కేంద్రమైందట.

ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్ మసీదులో మతపరమైన కార్యక్రమాలకు హాజరైన వందలాది మందిని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవచ్చు. వారిలో కొందరికి అదివరకే కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జమాత్ గ్రూపునకు చెందిన ఈ  తబ్లీఘీ జమాత్ సభ్యుల్లో చాలామంది విదేశాల నుంచి వఛ్చినవారే.. వీళ్ళు తెలిసో, తెలియకో ఈ వైరస్ జాడ్యాన్ని ఇతరులకు అంటించినట్టు వెల్లడవుతోంది.