
పసుపు తన పూర్తి స్థాయి ప్రభావాన్ని చూపించాలంటే దానికి తోడుగా కొన్ని పదార్థాలు అవసరమని సైన్స్ చెబుతోంది. డాక్టర్ పూజా రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో పసుపు గ్రహణశక్తిని పెంచే మార్గాలను వివరించారు. మన అమ్మమ్మల కాలం నాటి పసుపు, మిరియాల పొడి నెయ్యి కాంబినేషన్ వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు ఆధునిక వైద్య పరిశోధనల్లో కూడా నిరూపితమైంది. కేవలం ఒక చిటికెడు మిరియాల పొడి చేర్చడం వల్ల పసుపు పనితీరు 20 రెట్లు పెరుగుతుందని ఆమె చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
పసుపు ప్రయోజనాలు పెరగాలంటే ఇవి తప్పనిసరి:
మిరియాల పొడి : పసుపును మిరియాల పొడితో కలిపి తీసుకుంటే, శరీరంలో దాని గ్రహణశక్తి ఏకంగా 100 శాతం పెరుగుతుంది. మిరియాల్లో ఉండే ‘పైపెరిన్’ అనే పదార్థం, లివర్ కర్కుమిన్‌ను విచ్ఛిన్నం చేయకుండా అడ్డుకుంటుంది. దీనివల్ల పసుపు నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తుంది.
కొవ్వు పదార్థాలు : కర్కుమిన్ నీటిలో కరగదు, కేవలం కొవ్వులో మాత్రమే కరుగుతుంది. కాబట్టి పసుపును నెయ్యి లేదా కొబ్బరి నూనె వంటి ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకున్నప్పుడు మాత్రమే అది శరీరానికి అందుతుంది.
ఇకపై పసుపు పాలు తాగినా లేదా కూరల్లో వాడినా, అందులో ఒక చిటికెడు మిరియాల పొడి కొద్దిగా నెయ్యి ఉండేలా చూసుకోండి. అప్పుడే పసుపులోని అసలైన యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మీ చర్మానికి, ఆరోగ్యానికి అందుతాయి.
గమనిక: ఇది కేవలం సమాచారం మాత్రమే. సంస్థ దీనికి బాధ్యత వహించదు. ఏదైనా ఆరోగ్య సంబంధిత మార్పుల కోసం నిపుణులను సంప్రదించండి.