ప్రస్తుత కాలంలో అంతా వివిధ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఆయా లోపంతో ఎక్కువ రోజులు బాధపడకుండా వైద్యులను సంప్రదించి మందులు వాడుతున్నారు. ఇప్పుడు యువతతో పాటు మిడిల్ ఏజ్ ఉన్న వారు విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు. దీంతో వారు విటమిన్ -డి సప్లిమెంట్స్ ను మందుల రూపంలో వాడుతున్నారు. విటమిన్-డి అంటే కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని తీసుకున్న వారు ప్రీ డయాబెటిస్ లోని టైప్-2 డయాబెటిస్ నుంచి రక్షణ పొందుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విటమిన్ సహజంగా కూడా శరీరానికి అందుతుంది. సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్-డి పొందుతుంది. విటమిన్-డి శరీరంలోని ఇన్సులిన్, గ్లూకోజ్ జీవక్రియలో చాలా సాయం చేస్తుంది. విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో ఓ సారి తెలుసుకుందాం.
వివిధ పరిశోధనల్లో విటమిన్-డి లోపం ఉన్న వారు ఎక్కువగా టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్నారని తేలింది. అయితే విటమిన్ -డి సప్లిమెంట్స్ వాడడం ద్వారా వారు డయాబెటిస్ ఇబ్బంది నుంచి బయట పడ్డారని నిపుణులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైంది. విటమిన్ సప్లిమెంట్ వాడిన వారిలో 22.7 శాతం మందికి, ప్లెసిబో వాడిన 25 శాతం మందికి మధుమేహం వచ్చిందని నిపుణులు పేర్కొంటున్నారు. ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 374 మిలియన్ల మంది ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే వీరు విటమిన్ డి వాడితే 10 మిలియన్ల మందికైనా డయాబెటిస్ రాకను ఆలస్యం చేస్తుందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే విటమిన్-డి సప్లిమెంట్స్ ను అధికంగా తీసుకుంటే వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా వైద్యుల సూచన మేరకు విటమిన్-డి సప్లిమెంట్స్ ను వాడాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..