Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌‌లో వండిన ఆహారం ఆరోగ్యకరమేనా! నిపుణులు ఏమంటున్నారు?

ప్రస్తుత ఉరుకులుపరుగుల జీవితంలో ప్రెషర్ కుక్కర్ అనేది ప్రతి కిచెన్‌లో ఒక ముఖ్యమైన పాత్రగా మారిపోయింది. తక్కువ సమయంలో, తక్కువ గ్యాస్​తో ఆహారాన్ని త్వరగా వండడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, ప్రెషర్ కుక్కర్‌లో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి హాని ..

Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌‌లో వండిన ఆహారం ఆరోగ్యకరమేనా! నిపుణులు ఏమంటున్నారు?
Steel Cookerr

Updated on: Dec 12, 2025 | 6:36 AM

ప్రస్తుత ఉరుకులుపరుగుల జీవితంలో ప్రెషర్ కుక్కర్ అనేది ప్రతి కిచెన్‌లో ఒక ముఖ్యమైన పాత్రగా మారిపోయింది. తక్కువ సమయంలో, తక్కువ గ్యాస్​తో ఆహారాన్ని త్వరగా వండడానికి ఇది ఉపయోగపడుతుంది. అయితే, ప్రెషర్ కుక్కర్‌లో వండిన ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందా? పోషకాలు నశిస్తాయా? అనే ప్రశ్నలు తరచుగా వినపడుతూనే ఉంటాయి. ఈ విషయంపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

పోషకాలు నశించడం

సంప్రదాయ వంట పద్ధతుల్లో పోషకాలు బయటకు పోతాయి. అయితే, ప్రెషర్ కుక్కర్‌లో వంట చేయడం వల్ల పోషకాలు పూర్తిగా నశించవని నిపుణులు చెబుతున్నారు. ప్రెషర్ కుక్కర్ గాలి చొరబడకుండా, తక్కువ నీటితో పనిచేస్తుంది. దీనివల్ల వంట సమయం తగ్గుతుంది. తక్కువ సమయం ఉడికించడం వల్ల విటమిన్ C, ఫోలేట్ వంటి సున్నితమైన విటమిన్లు కొంతవరకు మాత్రమే నష్టపోతాయి, ఇది సాధారణ ఉడికించడం కంటే మెరుగైన ఫలితం. అయినప్పటికీ, అధిక ఉష్ణోగ్రత, పీడనం కారణంగా కొన్ని రకాల పోషకాలు ముఖ్యంగా బీన్స్, పప్పుధాన్యాలలో మార్పు చెందే అవకాశం ఉంది.

పిండి పదార్థాలపై ప్రభావం..

ప్రెషర్ కుక్కర్‌లో అధిక వేడి వద్ద బంగాళదుంపలు, బియ్యం వంటి స్టార్చ్ లేదా పిండి పదార్థాలను వండినప్పుడు అవి అక్రిలమైడ్ వంటి హానికరమైన రసాయన సమ్మేళనాలను ఉత్పత్తి చేయవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఈ రసాయనాలు పెద్ద మొత్తంలో తీసుకుంటే ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

గట్ హెల్త్ సమస్యలు

పప్పుధాన్యాలు, చిక్కుళ్ళు ప్రెషర్ కుక్కర్‌లో వండినప్పుడు, వాటిలో ఉండే లెక్టిన్స్ వంటి యాంటీ-న్యూట్రియంట్స్‌ను పూర్తిగా తొలగించకుండానే జీర్ణం చేయవలసి వస్తుంది. దీనివల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు వచ్చి, గట్ హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది.

అంతేకాదు, తక్కువ నాణ్యత గల అల్యూమినియం ప్రెషర్ కుక్కర్‌లను ఉపయోగిస్తే, అధిక వేడి వద్ద ఆ లోహం ఆహారంలో కలిసే ప్రమాదం ఉంది. అందుకే, ఫుడ్-గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ కుక్కర్‌లను ఉపయోగించడం ఉత్తమం. ప్రెషర్ కుక్కర్ అనేది సమయాన్ని ఆదా చేసే ఒక సౌకర్యవంతమైన సాధనం. సరైన జాగ్రత్తలు తీసుకుని వండిన ఆహారాన్ని తినడం వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే, ప్రతిరోజూ ప్రెషర్ కుక్కర్‌పై మాత్రమే ఆధారపడకుండా, సంప్రదాయ వంట పద్ధతులను కూడా అనుసరించడం ఆరోగ్యానికి మరింత మేలు.