
మనం రోజువారీ ఆహారంలో ఉపయోగించే సాధారణ ఉప్పు కిలో ధర ఎంత ఉంటుంది? మహా అయితే కొన్ని వందలు, అది కూడా హిమాలయన్ సాల్ట్, పింక్ సాల్ట్ వంటి అరుదైన రకాలు అయితేనే..! కానీ ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఉప్పు ఒకటి ఉంది. దాని పేరు కొరియన్ వెదురు ఉప్పు లేదా జుమ్‌యామ్. దీని ధర కిలోకు దాదాపు రూ.35,000 వరకు ఉంటుంది. ఇది ఇంత ఖరీదుగా ఉండటానికి, ఇంతటి ప్రాముఖ్యత పొందడానికి కారణం కేవలం దాని అద్భుతమైన తయారీ ప్రక్రియే. ఈ ఉప్పు ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం..
తొమ్మిదిసార్లు కాల్చిన ఈ ఉప్పును అత్యంత పోషకమైనదిగా, ఔషధ గుణాలు కలదిగా కొరియన్లు భావిస్తారు. ఈ ఉప్పు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది, రక్తంలోని విషాన్ని తొలగిస్తుంది, నోటి దుర్వాసనను తగ్గిస్తుంది, శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుందని అక్కడి సాంప్రదాయ వైద్యంలో విశ్వసిస్తారు.
ఖరీదైన రెస్టారెంట్‌లలో దీనిని ప్రత్యేక వంటకాలకు ఉపయోగిస్తారు. ఈ అసాధారణమైన తయారీ ప్రక్రియ, శ్రమ, దాని అరుదైన ఆరోగ్య ప్రయోజనాల కారణంగానే ఈ వెదురు ఉప్పు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటిగా నిలిచింది.