
నిద్రపోయే ముందు తరచుగా తమ గదిలోని లైట్లు ఆపివేస్తారు. అయితే, కొంతమంది రాత్రిపూట లైట్లు ఆపివేయరు.. అలానే.. లైట్ల వెలుతూరులో పడుకుంటారు.. అయితే.. రాత్రివేళ పడుకునే సమయంలో లైట్లు ఆపి నిద్రపోవాలా..? లేదా ఆన్ చేసి నిద్రించాలా.? అనేది మీకు తెలుసా? అనేది తెలియకపోతే ఈ కథనాన్ని చదవండి.. నిద్రపోయేటప్పుడు లైట్లు ఆపివేయాలా లేదా ఆన్ చేయాలా అనే దానిపై హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక అధ్యయనాన్ని నిర్వహించింది. దీనిలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి..
అమెరికాలోని ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు మానవ నిద్రపై ఒక అధ్యయనం చేశారు. రాత్రిపూట నిద్రపోతున్నప్పుడు కృత్రిమ కాంతి మీ కళ్ళపై పడితే, అది మీ గుండె – మెదడును ప్రభావితం చేస్తుందని ఈ అధ్యయనంలో వెలుగులోకి వచ్చింది. నిద్రపోతున్నప్పుడు కళ్ళకు కొద్దిగా వెలుతురు చేరినా, అది మెదడును సక్రియం చేస్తుందని, దీనివల్ల ధమనులలో రక్త ప్రసరణ పెరుగుతుందని అధ్యయనంలో కనుగొనబడింది. నిద్రపోతున్నప్పుడు శరీర కార్యకలాపాల వేగం మందగిస్తుంది. కాబట్టి, అటువంటి పరిస్థితిలో రక్త ప్రసరణ పెరిగితే, అది గుండెను ప్రభావితం చేస్తుంది. దీని అర్థం రాత్రిపూట లైట్లు వెలిగించడం గుండె – మెదడు రెండింటికీ హానికరం..
చాలా మంది రాత్రిపూట లైట్లు ఆఫ్ చేయరు.. కొంతమంది చీకటి భయం అంటే నిక్టోఫోబియా కారణంగా లైట్లు వెలిగించి నిద్రపోతారు. మరికొందరు రాత్రిపూట లేవాల్సి వస్తే ఎలా అని.. దారి స్పష్టంగా కనిపించేలా లైట్లు కూడా ఆన్ చేస్తారు. చాలా కాలంగా ఒత్తిడిలో ఉన్నవారు కూడా లైట్లు వెలిగించి నిద్రపోతారు. కొంతమంది సోమరితనం కారణంగా లైట్లు వెలిగించి నిద్రపోతారు.
హార్వర్డ్ విశ్వవిద్యాలయ అధ్యయనం ప్రకారం, రాత్రిపూట లైట్లు వెలిగించడం వల్ల మొత్తం శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. మీరు లైట్లు వెలిగించి నిద్రపోతే, మీరు ఈ అలవాటును మార్చుకోవాలని.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం పరిశోధకులు సూచిస్తున్నారు.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..