
బ్రోకలీలో కాల్షియం, విటమిన్ K అధికంగా ఉంటాయి. ఈ రెండూ ఎముకల ఆరోగ్యానికి, బోలు ఎముకల వ్యాధి నివారణకు తోడ్పడతాయి. ఇందులో ఫైబర్స్, కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు శరీరంలో రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. రక్త నాళాలు దెబ్బతినకుండా రక్షించడంలో కూడా సహాయపడుతుంది.

గుడ్లు, నట్స్ కంటికి ఎంతో మేలు చేసే పోషకాలు కలిగి ఉంటాయి. గుడ్లలో లూటిన్, జియాక్సంతిన్ కంటి కణాలను రక్షించడంలో సహాయపడతాయి. నట్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పొడి కళ్ల సమస్యను తగ్గిస్తాయి.

నిమ్మ, నారింజ వంటి పుల్లని పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిలో ఉన్న విటమిన్లు, న్యూట్రియెంట్లు కంటి కణాలను రక్షించి కంటి చూపును మెరుగుపరుస్తాయి. క్యారెట్లు, గుమ్మడికాయలు, బీట్‌రూట్ వంటి కూరగాయలలో కెరోటినాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని దృఢపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

పాలకూర కంటి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన ఆహారం. ఇందులో ల్యూటిన్, జియాక్సంతిన్ వంటి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. ఇవి కంటి కణాలను రక్షించి కంటి మచ్చల క్షీణత, కంటిశుక్లం వంటి సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. పాలకూరను ఆహారంలో తరచుగా చేర్చడం వల్ల కంటికి కావలసిన పోషకాలు అందుతాయి.

కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన ఆహారపు అలవాట్లు చాలా అవసరం. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా మాత్రమే కంటి చూపును మెరుగుపరచడం సాధ్యమవుతుంది. మొబైల్స్, కంప్యూటర్లు ఉపయోగిస్తున్నప్పుడు కంటికి విరామం ఇచ్చి తగిన జాగ్రత్తలు తీసుకోవడం కూడా ఎంతో ముఖ్యమైంది. కంటి ఆరోగ్యానికి దోహదపడే ఈ ఆహారాలను తరచుగా ఆహారంలో చేర్చండి. మీ కళ్లకు పూర్తి రక్షణ కల్పించండి.