White Hair: ఇలా చేస్తే మీ తెల్లజుట్టు నల్లగా మారడం ఖాయం.! సహజ పద్ధతులు..
కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం వల్ల ఇటీవలి కాలంలో చాలా మంది జుట్టు చిన్న వయసులోనే తెల్లబడిపోతోంది. చాలా మందిలో వెంట్రుకలు రాలిపోవడం, జుట్టు పలుచబడడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంట్రుకలకు రసాయనాలతో కూడిన రంగులు వేసుకోవడం వల్ల కూడా జుట్టు తెల్లబడటం, రాలిపోవడం పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కొన్ని సహజ పద్ధతులతో ఈ సమస్య తగ్గుతుందని... జుట్టు తెల్లబడటం ఆగిపోయి, తిరిగి నలుపు సంతరించుకుంటుందని చెబుతున్నారు.
టీ డికాక్షన్ లేదా బ్లాక్ టీ గోరువెచ్చగా ఉన్నప్పుడు కుదుళ్లకు తగిలేలా రాసుకుని మర్దన చేసుకుంటే ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ టీ లో ఉండే టానిన్స్ వెంట్రుకలు తెల్లబడటాన్ని, రాలిపోవడాన్ని నియంత్రిస్తాయని వివరిస్తున్నారు. ఉసిరి కాయల రసాన్ని కుదుళ్లకు తగిలేలా తరచూ మర్దన చేస్తే… వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. వెంట్రుకలు బలంగా పెరిగేందుకు, తిరిగి నలుపు రంగులోకి మారేందుకు ఇది తోడ్పడుతుందని వివరిస్తున్నారు. హెన్నా కూడా చాలా మందికి తెలిసినదే. ఇది వెంట్రుకలు నల్లగా, నిగనిగలాడేలా ఉండేందుకు తోడ్పడుతుంది. అయితే ఇటీవల మార్కెట్లో అమ్మే హెన్నాలో రసాయనాలు కలిపి వస్తున్నాయి. కాబట్టి సహజమైనది వాడితేనే సరైన ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.
జుట్టును నల్లబరచడంలో మందారం కూడా అద్భుతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని మందార పూలను నీటిలో రాత్రంతా నానబెట్టి, ఆ నీటిలో కొంచెం కొబ్బరి నూనె కలిపి వెంట్రుకలకు పట్టిస్తే… మంచి నలుపు రంగు సంతరించుకుంటాయని వివరిస్తున్నారు. చాలామందికి తెలియని ఆయుర్వేద మూలిక సహదేవి మొక్క. దీనిని ఆయుర్వేద నూనెల తయారీలో వినియోగిస్తుంటారు. ఈ మూలిక వెంట్రుకలు తెల్లబడకుండా నివారించడంతోపాటు చుండ్రుపై అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనె వెంట్రుకలకు బలాన్ని ఇవ్వడంతోపాటు నలుపు రంగు సంతరించుకునేందుకు కొబ్బరి నూనె దోహదం చేస్తుంది. బాగా ఫిల్టర్ చేసిన నూనెల కన్నా సహజ నూనె వాడితే ఫలితం మరింత ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. జుట్టును నల్లబరచడంలో నువ్వుల నూనె అద్భుతంగా పనిచేస్తుంది. పురాతన కాలం నుంచి ఈ నూనెను వాడుతున్నారు. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు వెంట్రుకల కుదుళ్లు బలంగా ఉండటానికి దోహదం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల నూనెను కొంత ఆలివ్ ఆయిల్ తోగానీ, బాదం నూనెతోగానీ కలిపి వాడితే మరింత ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.