Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సిందే..

Health Tips: వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాతావారణంలోని మార్పులకు తోడు కలుషితమైన నీటి కారణంగా పలు సమస్యలు వెంటాడుతుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు తోడు ఎసిడిటీ, వికారం, బరువు పెరగడం

Monsoon Health Tips: వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆహార పదార్థాలను దూరం పెట్టాల్సిందే..
Monsoon Health Tips
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jul 03, 2022 | 6:53 AM

Health Tips: వర్షాకాలంలో అనేక రకాల వ్యాధులు మనల్ని ఇబ్బంది పెడతాయి. వాతావారణంలోని మార్పులకు తోడు కలుషితమైన నీటి కారణంగా పలు సమస్యలు వెంటాడుతుంటాయి. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులకు తోడు ఎసిడిటీ, వికారం, బరువు పెరగడం తదితర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇక వర్షాకాలంలో చాలామంది పకోడీలు, బజ్జీలు, ఫ్రైడ్‌ ఫుడ్స్‌, చిప్స్‌ వంటి ఆహార పదార్థాలను అధికంగా తీసుకుంటుంటారు. ఇవి కూడా అనారోగ్యానికి దారితీస్తాయి. ఈక్రమంలో వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధుల బారి నుంచి రక్షణ పొందాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవాలంటున్నారు ఆయుర్వేద నిపుణులు. కొన్ని ఆహారపదార్థాలను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు మరికొన్నింటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.

పాలు, పెరుగు

వర్షాకాలంలో పాలు, పెరుగును తీసుకోవడం తగ్గించాలి. వాస్తవానికి, ఈ సీజన్‌లో, పశువుల మేతపై పెరిగే కీటకాలు పాలు లేదా ఇతర వస్తువుల ద్వారా మనపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి

ఆకు కూరలు

ఆయుర్వేదం నిపుణుల ప్రకారం వర్షాకాలంలో ఆకు కూరలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో ఆకులపై క్రిములు పెద్ద మొత్తంలో పేరుకుపోతాయని నిపుణులు చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో వాటిని సరిగా శుభ్రం చేసుకోకుండా తింటే అనారోగ్యానికి గురవుతారు.

బెండకాయ, క్యాబేజీ

ఈ సీజన్‌లో బెండకాయలు, క్యాబేజీలు తదితర కూరగాయలను వీలైనంత తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వర్షాకాలంలో వాటిలో క్రిములు పెరిగే అవకాశముంది. ఇవి ఉదర సంబంధిత సమస్యలను తెచ్చిపెడతాయి.

మాంస పదార్థాలు..

వర్షాకాలంలో నాన్‌వెజ్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. వాతావరణంలోని తేమ, కలుషిత నీటి కారణంగా మాంసం త్వరగా చెడిపోతుంది. అందువల్ల వీటిని దూరంగా ఉంచడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Latest Articles