వేసవిలో ఈ పండ్లు ఎక్కడ కనిపించినా తినేయండి..! లాభాలు బోలేడు..

Jyothi Gadda

01 May 2024

వేసవిలో లభించే ఆప్రికట్స్‌లో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఇతర కెరొటీనాయిడ్స్ వంటి పలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.  విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని డ్రై ఫ్రూట్స్‌గా కూడా తింటారు.

ఆరోగ్య నిపుణుల ప్రకారం ఒక కప్పు ఎండిన ఆప్రికాట్‌లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. 

ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. 

ఆప్రికాట్లు ఫైబర్ తో నిండి ఉంటాయి. శరీరానికి ఫైబర్ ఎంతో అవసరమైన ఖనిజం. పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే అధికంగా ఫైబర్ తీసుకుంటే అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. 

క్యాన్సర్ నివారిణిగా సహాయపడే కెరోటినాయిడ్స్, యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు ఆప్రికాట్లలో అధికంగా ఉన్నాయి. క్రమం తప్పకుండా ఆప్రికాట్లు తినడం ద్వారా క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

ఎముకల బలానికి అవసరమయ్యే కాల్షియం, ఐరన్, రాగి, మాంగనీస్, ఫాస్పరస్ వంటి ఆవశ్యక మూలాలు ఆప్రికాట్లలో పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి.

ప్రతి రోజూ ఒకటి, రెండు డై ఆప్రికాట్‌లను నానబెట్టి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఆప్రికాట్లు ఎక్కువగా తింటే కడుపు చికాకు పెడుతుంది. తిమ్మిరి, ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం, విరోచనాలకు కారణంఅవుతుంది.