ఎండాకాలంలో దొసకాయలు (cucumber) చాల ఎక్కువగా తినేస్తుంటారు. ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సహయపడుతుంది. అంతేకాకుండా.. బరువు తగ్గేందుకు డైట్ చేస్తున్నవారు ఈ దొసకాయలను సలాడ్‌గా తీసుకుంటారు. ఇవి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలనిస్తాయి. అయితే ఆరోగ్యానికి మంచి చేస్తుంది కదా ఎక్కువగా తినేస్తే శరీరంలో పలు సమస్యలను కలిగిస్తుంది. ఇంతకీ అవెంటో తెలుసుకుందామా.
రాత్రిపూట దొసకాయలను అస్సలు తినకూడదు.. పడుకోవడానికి కనీసం 3, 4 గంటల ముందు దొసకాయలను తింటే పర్లేదు. కానీ పడుకునే ముందు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఆహారం తిన్న తర్వాత దొసకాయ తింటే తొందరగా జీర్ణం కాదు.. దీంతో నిద్రపై ప్రభావం చూపిస్తుంది. విటమిన్ కే.. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే దోసకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి. అయితే అతిగా తినడం వలన శరీరంలోని అదనపు ద్రవాన్ని బయటకు పంపిస్తాయి. దీంతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉంటుంది.
సెన్సిటివ్ పొట్ట ఉన్నవారు దొసకాయలు తినడం ప్రమాదమే.. ఎందుకంటే ఇందులో ఉండే కుకుర్బిటాసిన్ జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు వస్తాయి. అలాగే గ్యాస్ట్రైటిస్, గ్యాస్ సమస్యలు వస్తాయి. సైనస్ ఉన్నవారు దొసకాయలకు దూరంగా ఉండాలి. అలాగే శ్యాసకోశ సమస్యలు ఉన్నవారికి కూడా దొసకాయ మంచిది కాదు. చర్మ సమస్యలు ఉన్నవారు దొసకాయలను తినకూడదు. అమెరికన్ అకాడమీ ఆఫ్ అలెరజిక్ ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ నిర్వహించిన అధ్యయనం ప్రకారం దొసకాయ చర్మ అలెర్జీలను కలిగిస్తుంది. దీంతో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. అలాగే దొసకాయలు.. నీళ్లు కలిపి అస్సలు తీసుకొవద్దు.. దొసకాయ తిన్న వెంటనే నీరు తాగకూడదు..
గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.