
ఆధునిక జీవనశైలి కారణంగా మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడటం అనేది ఇటీవల కాలంలో సాధారణ విషయంగా మారింది. సగటున పది మందిలో ఇద్దరు ముగ్గురు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే, రాళ్ల పరిణామాన్ని బట్టి అవి మన ఆరోగ్యానికి ఎంత ప్రమాదమనే విషయాన్ని నిర్ధరిస్తారు. చిన్న చిన్న రాళ్లు అయితే మూత్రంలో వెళ్లిపోయే అవకాశం ఉంది. వాటి పరిమాణం ఎక్కువగా ఉంటే మాత్రం ప్రమాదమనే చెప్పాలి. ఇందుకు సంబంధించిన మరిన్ని విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
1 నుంచి 4 మి.మీ(చాలా చిన్నవి) పరిమాణంలో ఉండే రాళ్లు.. నీటిని పుష్కలంగా తాగడం ద్వారా మూత్రంలొ వాటిని బయటికి పంపవచ్చు. సాధారణంగా, నొప్పి నివారణ మందులు వాడితే సరిపోతుంది.
5 నుంచి 7 మి.మీ మధ్య ఉన్న రాళ్లను కొన్నిసార్లు మందులు, ద్రవాలతో తొలగించవచ్చు. అయినప్పటికీ అవి బయటకు రాకపోతే లిథోట్రిప్సీ వంటి చికిత్సతో వాటిని తొలగించవచ్చు.
8 నుంచి 10 మి.మీ అంటే పెద్ద పరిమాణం గల రాళ్లు వాటికవే బయటకు వచ్చే అవకాశం తక్కువ. అందుకే లిథోట్రిప్సీ లేదా యూరిటెరోస్కోపీ అవసరం కావచ్చు.
10 మి.మీ కంటే ఎక్కువగా అంటే చాలా పెద్ద రాళ్లు. ఇవి కూడా వాటంతటే బయటకు పోవు. వీటికి మాత్రం శస్త్రచికిత్స అవసరం. యూరిటెరోస్కోపీ లేదా PCNL వంటి ప్రక్రియలతో రాళ్లను బయటకు తీస్తారు.
10 మి.మీ కంటే పెద్ద రాళ్లు సాధారణంగా వాటంతట అవే బయటికి పోవు కాబట్టి.. వీటిని శస్త్రచికిత్స చేసి బయటకు తీస్తారు. 10 మి.మీ కంటే పెద్ద రాళ్లను శస్త్రచికిత్స లేదా మినిమల్లీ ఇన్వాసివ్ చికిత్స ద్వారా బయటకు తీస్తారు.
గజ్జల్లో లేదా పొత్తి కడుపులో కత్తిపొటు లాంటి నొప్పి
మూత్రంలో రక్తం
నిరంతరం వికారం లేదా వాంతులు కావడం
జ్వరం, చలి
మూత్రం రంగు మారడం లేదా దుర్వాసన కలిగి ఉండటం
రాయి దాని స్థానం నుంచి కదిలినప్పుడు లేదా మూత్రనాళంలో ఇరుక్కుపోయినప్పుడు నొప్పి ఎక్కువగా ఉంటుంది.
తీవ్రమైన, దీర్ఘకాలిక నొప్పి ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
మూత్రం రాకపోవడం
జ్వరం లేదా ఇతర తీవ్ర ఆరోగ్య సమస్యలు
నిరంతరం విరేచనాలు, వాంతులు
మూత్రంలో రక్తం లాంటి లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ముఖ్యం.